A guide and his friends raped an american girl in Delhi. This incident happened in March and girl complaint after many months. Delhi police filed complaint and started investigation on this case.
అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఎప్పుడెప్పుడు కాటేద్దామా? అని ఆయతాయిలు వెయిట్ చేస్తుంటారు. మనిషినన్న విషయాన్ని మరిచిపోయి.. మృగంలా యువతులపై ఎగబడుతుంటారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే.. తాము మాత్రం మారేదిలేదంటూ దుర్భుద్ధినే కలిగివుంటారు. ఇలాంటివారి బారినపడి మరో యువతి బలైంది. దేశాన్ని విహరిద్దామని, ఇక్కడి సంస్కృతి-సంప్రదాయాల గురించి తెలుసుకుందామని ఎక్కడో అమెరికా నుంచి ఒక అమ్మాయి వస్తే.. ఐదుగురు దుండగులు దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ దారుణం గురించి బాధితురాలు ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాపై మార్చిలో ఢిల్లీకి వచ్చింది. కనాట్ ప్లేస్ దగ్గరలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసింది. ఢిల్లీలోని టూరిస్ట్ స్పాట్‌ల గురించి తెలుసుకోవడం హోటల్ సిబ్బంది సూచన మేరకు ఓ ఏజెన్సీకి చెందిన టూరిస్ట్ గైడ్‌ని నియమించుకుంది. ఎంతో నమ్మకంగా అతడ్ని చేరదీసుకుంటే.. అతడు మాత్రం ఆ యువతిపై కన్నేశాడు. మరుసటి రోజే ఆమె హోటల్ గదిలో ఉన్న సమయంలో రూట్ ప్లాన్ గురించి మాట్లాడాలంటూ మరో నలుగురితో కలిసి ఆ గైడ్ లోనికి ప్రవేశించాడు. గైడ్ మీదున్న నమ్మకంతో అందరినీ లోనికి రానించింది. అప్పటికే ఫుల్ ప్లాన్‌తో వచ్చిన ఆ ఐదుగురు.. ఆమెకి బలవంతంగా డ్రింక్ తాగించారు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు ఆమెని రేప్ చేశారు. వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా.. ఏమాత్రం కనికరించలేదు.
ఎంజాయ్ చేద్దామని దేశానికి వస్తే.. తనకు ఇంత దారుణం జరగడంతో ఆ యువతి కుంగిపోయి తిరిగి అమెరికాకి వెళ్లిపోయింది. తనకు జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేదు. కానీ.. ఎంతోకాలం ఆమె ఈ బాధని దిగమించుకోలేకపోయింది. ఈ ఘటనతో మరింత కుంగిపోతూ వచ్చింది. చివరికి కొన్ని నెలల తర్వాత జరిగిన తతంగం మొత్తం తన స్నేహితురాలైన లాయర్‌ని చెప్పింది. ఆమె సలహా మేరకు భారత్ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ ఎన్జీవోను సంప్రదించింది. వారి ద్వారా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఈ మెయిల్ ద్వారా తనని రేప్ చేసిన దుండగుల మీద ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును కనాట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయగా.. వారు దర్యాప్తు చేస్తున్నారు.