అనుభవం అంటే ‘అన్ని’ సినిమాలు చేశాం ‘ఇన్ని’ సినిమాలు చేశాం అని చెప్పుకునే సంఖ్యలా?? ప్రేక్షకుల మారుతున్న అభిరుచిని పట్టించుకోరా??
సినిమాని చంపొద్దు అని లెక్చర్లు బాగానే ఇస్తారు.. ఎన్నో వేల మంది సినిమాపై బ్రతుకుతున్నారని చెబుతారు.. అవును నిజమే.. కానీ కొన్ని లక్షల మంది చూసే సినిమాని ‘వళ్ళు’ దగ్గర పెట్టుకొని ఎందుకు తీయడం లేదు??
అసలు సినిమాని చంపుతున్నదెవరు?? టెంప్లేట్ కథలు తయారుచేసుకొని.. రెండు మూడు సీన్లు సూపర్ గా రాసేసుకుని.. ఈ సీన్ల కోసమైనా సినిమాకి ప్రేక్షకులు వస్తారనే భ్రమలో నిర్మాతని నమ్మించి.. పాతచింతకాయ పచ్చడిని రుబ్బి రుబ్బి ‘నీచంగా’ తెలుగు సినిమాని చంపేస్తున్నారు..
ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా అంటున్నారు… అసలు ఆ సినిమా చూస్తే మీరైనా నవ్వుతారా?? గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి!! అవును జనాలు నవ్వుతున్నారు తాము వెర్రి పప్పలైనందుకు జనాలు బాగా నవ్వుతున్నారు.
అంతగా డబ్బులు ఎక్కువైతే సినీ పరిశ్రమలో ఎంతో ‘కళాత్మక’ శ్రమ చేసే నిజమైన పేద కళాకారులకి ఇవ్వండి.. కానీ ఇలా మీ ఇంట్లో ‘దెయ్యాల్ని’ మాపై వదలకండి.
నోట్: దయచేసి ‘దెయ్యం’ జోలికి మాత్రం వెళ్ళకండి.. కొత్త సంవత్సరం ఆ ‘కామెడీ హింస’ని మీ దరిచేరనివ్వకండి.