Another smartphone has created sensation on internet. According to the flipkart company, 35000 Lenovo k6 power phone sold in just 15 minutes.
ఫ్రస్తుతం ‘స్మార్ట్ ఫోన్’ల కాలం నడుస్తోంది. మార్కెట్‌లోకి ఏ కొత్త మొబైలో వచ్చినా.. కనురెప్ప పాటులోనే అమ్ముడవుతున్నాయి. అన్ని కంపెనీలవారు అతి తక్కువ ధరలకే అనూహ్యమైన ఫీచర్లతో మొబైల్ ఫోన్లను విడుదల చేస్తుండడంతో.. జనాలు ఎగబడి కొంటున్నారు. దీంతో.. ఆయా కంపెనీలు పోటీపడిమరీ మరిన్ని ఫీచర్స్ పెంచుతూ.. ఇంకా ధరలు తగ్గించి ఫోన్లను రిలీజ్ చేస్తున్నారు. ఆ కోవకే చెందిన లేనోవో కంపెనీ తాజాగా ‘కే6 పవర్’ అనే స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అది వచ్చిరాగానే.. సంచనాలు సృష్టిస్తోంది.
మొదటిసారి ఈ ఫోన్లను ప్రవేశపెట్టినప్పుడు ఒకరోజులో భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. సెకండ్ సేల్‌లో మాత్రం కేవలం 15 నిముషాల్లోనే ఏకంగా 35 వేల ఫోన్లు సోల్డ్ అయ్యాయి. ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్స్ ఉండడం వల్లే జనాలు దీన్ని తీసుకోవడం కోసం ఎగబడ్డారని, అందుకే అంత తక్కువ సమయంలో అన్ని ఫోన్లు అమ్ముడయ్యాయని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ తెలిపింది. త్వరలో మరో సేల్ పెట్టినప్పుడు.. ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ ఫోన్ల్ కొనుగోలు చేయబడుతాయని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ఈనెల 18 నుంచి 21 వరకు మూడోసారి ఈ ఫోన్ విక్రమాలకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ధర రూ.9,999 మాత్రమే.
పూర్తిగా మెటల్ బాడీతో డిజైన్ చేసిన ఈ ఫోన్ ఫీచర్స్ కింది విధంగా ఉన్నాయి :
– 5 అంగుళాల హై డెఫినిషన్ టచ్ స్ర్కీన్
– డాల్బీ అట్మాస్ సౌండ్
– ఫింగర్ ప్రింట్ స్కానర్
– 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
– 3 జీబీ ర్యామ్
– 13 ఎంపీ రేర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
– ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఓఎస్
– 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ