ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోయే ఆ ముగ్గురు భామలు వీళ్లేనా..?

ntr to romance kajal agarwal niveda thomas anupama in his 27th film

Young tiger NTR to romance three heroines in his 27th film. Bobby directing this movie and Kalyan Ram Producing under NTR arts banner. Shooting will start from January.

బాబీ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేయనున్న తన 27వ ప్రాజెక్ట్‌కి సంబంధించి అన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. ఓవైపు బాబీ స్ర్కిప్ట్‌ని ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా.. మరోవైపు నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా ముగించడంలో బిజీ అయిపోయాడు. తారక్ కూడా అన్ని వ్యవహారాల్ని దగ్గరుండిమరి చూసుకుంటున్నాడు. ఇక త్వరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిన వీరు ముగ్గురు.. హీరోయిన్స్ విషయంలో ఓ ఫైనల్ డెసిషన్‌కి వచ్చేశారని టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కథ డిమాండ్ మేరకు ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయనున్నారట. ఆ ముగ్గురిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారట. కాజల్ అగర్వాల్, నివేదా థామస్, అనుపమా పరమేశ్వరన్‌లను దాదాపు ఓకే చేశారని అంటున్నారు. ఇందులో తారక్ తొలిసారి మూడుపాత్రలో పోషిస్తున్నాడని సీక్రెట్ ఇప్పటికే లీకైపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మూడు పాత్రలకు తగ్గట్టుగా ఆ ముగ్గురు కథానాయికల్ని ఎంపిక చేసుకున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ మూవీ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభించాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్‌నాటికి చిత్రీకరణ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ntr-three-heroines-1

Leave a comment