ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత తారక్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఆశగా ఎదురుచూసారు ఫ్యాన్స్. గ్యారేజ్ అందించిన సక్సెస్ ఊపులో ఏదో ఒక సినిమాను సెలెక్ట్ చేసుకుంటాడు అని అనుకున్నారు అందరు. కానీ వారి ఆశలపై నీళ్ళు చల్లాడు ఎన్టీఆర్. గ్యారేజ్ విడుదల కావడం, సినిమా హిట్ కావడం.. జరిగిపోయి చాలా రోజులు గడుస్తున్నా తారక్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. అందుకు కారణం కూడా తానే అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. గ్యారేజ్ సెట్స్‌పై ఉన్నప్పుడు తారక్‌తో సినిమా చేయడానికి క్యూ కట్టిన డైరెక్టర్స్ ఇప్పుడు వేరే స్టార్స్‌తో సినిమాలు చేసుకుంటున్నారు. దీంతో సినిమాలేమీ లేక ఖాళీగా మారాడు ఎన్టీఆర్ అంటూ ఓ వర్గం ఆడియెన్స్ తారక్‌పై కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి తన నెక్ట్స్ మూవీ విషయంలో ఓ స్టార్ హీరోను ఫాలో అవుతున్నాడట ఎన్టీఆర్!
‘అత్తారింటికి దారేది’ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది కూడా ఇటువంటి పరిస్థితే. అప్పుడు ఆ సినిమా సంచలన విజయంగా నిలిచనప్పటికీ ఆ సినిమా తరువాత పవన్ నెక్ట్స్ మూవీ రావడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో ఇప్పుడు పక్కా ప్లానింగ్‌తో వరుస పెట్టి తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలను రీమేక్ చేసుకుంటూ వెళుతున్నాడు పవన్. తారక్ కూడా అజిత్ నటించిన ఓ సినిమాను ఓ తమిళ స్టార్ డైరెక్టర్‌తో చేయడానికి రెడీ అవుతున్నాడట. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. తారక్ సెలెక్ట్ చేసుకున్న సినిమాల లిస్ట్‌లో మల్టీస్టారర్ సినిమానే ఫస్ట్ ఉందట. దీనికోసం మెగా ఫ్యామిలీకి చెందిన ఓ స్టార్ హీరోతో మల్టీస్టారర్ సినిమాకు సై అంటున్నాడట ఎన్టీఆర్. అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమాతో తారక్ టాలీవుడ్‌పై మరోసారి దండయాత్ర చేయడానికి సిద్ధమవుతాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు!