విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్ఛర్యపోతున్నారు. ధ్యే..వు..డా..థర్టీ ఇయర్స్ పృథ్వీ మామూలోడు కాదు. అమాయకుడైతే అస్సలు కాదు అని అనుకుంటున్నారు. అసలు విషయమేంటంటే థర్టీ ఇయర్స్ పృథ్వీ పైన ఓ పోలీస్ కేసు నమోదైంది. అది కూడా అలాంటిలాంటి కేసు కాదు. తనను పెళ్ళి చేసుకుని మోసం చేసి వదిలేశాడని థర్టీ ఇయర్స్ పృథ్వీపైన ఓ మహిళ ేకేసు పెట్టింది. ఆ విషయం తెలిసిన వెంటనే అందరి ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవే.
అయితే కొంతమంది మాత్రం ముందసలు ఆ న్యూస్ నిజమో కాదో తెలుసుకోండయ్యా. …ఆ తర్వాత కామెంట్స్ చేద్దురు అని అంటున్నారు. ఈ మధ్య మహిళలు కూడా తక్కువేం కాదు. అసలే పృథ్వీ పిచ్చ ఫాంలో ఉన్నాడు కదా….ఇలాంటి స్టంట్ ఏదో చేసేస్తే కోట్లు కొట్టెయ్యచ్చని ప్లాన్ చేసిన బాపతు ఏమో చూడండి అని కూడా చెప్తున్నారు. నిజానిజాలు ఇంకా బయటికి రాలేదు కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మాత్రం పృథ్వీ కేసు గురించే డిస్కస్ చేస్తున్నారు. ఈ కేసులో అసలు తప్పు ఎవరిదో? పృథ్వీ అమాయకుడా? దేశముదురా అన్న విషయం కూడా పోలీసులే తేల్చేయాలి మరి.