తారక్ విధ్వంశక ప్రదర్శన చూసి చాలా కాలమైంది. ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ సినిమాలు అన్నీ కొంత మాస్ కి దూరంగా చేసిన సినిమాలే. జనతా గ్యారేజ్ అనే సినిమా ఎన్టీఆర్ అభిమానుల ఆకలి ని ఒక రేంజ్ లో తీరుస్తుందని ఆ సినిమా టీమ్ లోని ఒక సహచరుడు చెప్పాడు. రెండు వరుస హిట్లతో మాంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ఒక సామాజిక సందేశం తో పాటు సినిమాను పక్కాగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేవిధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారంట… మళ్ళీ సింహాద్రి నాటి ఎన్టీఆర్ మనకి జనతా గ్యారేజ్ లో ఇరగదీశాడంట.
ఈ సినిమాలో ఎన్టీఆర్ అభినయం సామాన్య ప్రేక్షకులని సైతం విస్మయానికి గురి చేయడం ఖాయం అంటున్నారు. ఇక ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు చూడటానికి అయితే రెండు కళ్ళు చాలవంట. అలాగే ఎన్టీఆర్ , సమంతా , నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా యూత్ ని అలరించేవిధంగా తీర్చిదిద్దారంట.
ఎన్టీఆర్లో డాన్సర్ ని ఇంకొక స్థాయిలో నిలబెట్టేలా ఈ సినిమాలో డాన్స్ అదిరిపోయేలా వేశాడంట. ఎన్టీఆర్ తర్వాత సినిమాకి డాన్స్ కంపోజ్ చెయ్యటం కష్టమే అని అనుకుంటున్నారట డాన్స్ మాస్టర్లు.మాస్ ప్రేక్షకులనే కాకుండా ఇటు క్లాస్ ఆడియన్స్ ని సైతం అలరించేలా ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చాయంట. ఇక ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.