Gossipsఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ!

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ!

మిర్చి, శ్రీమంతుడు వంటి వరుస హిట్లతో విజయపథంలో దూసుకుపోతున్న కొరటాల శివ అలాగే టెంపర్ మరియు నాన్నకు ప్రేమతో డీసెంట్ హిట్లతో హిట్ల ట్రాక్ లోకి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కి జతగా 4 వ సారి సమంతా , మొదటిసారిగా నిత్యా మీనన్ నటించారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి వండర్ ఫుల్ మ్యూజిక్ అందించాడు.దీనికి తోడు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం తో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకి సిద్దమైన జనతా గ్యారేజ్ సినిమా కొద్ది సమయం క్రితం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి అందరూ ఊహిస్తున్నట్లుగానే U/A సర్టిఫికెట్ వచ్చింది. నిడివి 2 గంటల 40 నిమిషాలు. ఇక మనకి వస్తున్న సమాచారం ప్రకారం జనతా గ్యారేజ్ సినిమా జన రంజకంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొరటాల శివ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడంట. నిడివి కొంచెం ఎక్కువగా అనిపించినా ఎక్కడా ప్రేక్షకుడు బోర్ ఫీల్ లేకుండా సన్నివేశాలు చాలా బాగా కుదిరాయంట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు పెట్టిన ఒక్కొక్క రూపాయి స్క్రీన్ పై మనకి కనిపిస్తుందట. అంతే కాదు ఒక మంచి సామాజిక సందేశాన్ని కమర్షియల్ హంగులతో ఎంతో బాగా కూర్చిన కొరటాల శివ కి సెన్సార్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సెప్టెంబర్ 1 న ఎన్టీఆర్ అభిమానులకి పండగే అని ఇన్నర్ టాక్ వస్తుంది… ఎప్పటినుంచో మాంచి ఆకలి మీద ఉన్న తారక్ అభిమానులకి ఈ సినిమా పూర్తి స్థాయిలో కడుపు నింపుతుందంట. ఒక మంచి సందేశంతో పాటు అన్ని కమర్షియల్ హంగులతో తయారైన జనతా గ్యారేజ్, అన్ని రికార్డులని బద్దలు కొట్టి ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news