Reviewsనాగశౌర్య "చలో" సినిమా రివ్యూ, రేటింగ్

నాగశౌర్య “చలో” సినిమా రివ్యూ, రేటింగ్

యువ హీరోల్లో ప్రత్యేకత చాటుకున్న నాగ శౌర్య వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛలో. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సాగర్ మహతి మ్యూజిక్ అందించాడు. ఉషా నిర్మాణంలో నాగ శౌర్య సొంతంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిందా లేదా అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చిన్నప్పటి నుండి గొడవల్లో ఇంట్రెస్ట్ చూపించే హీరో హైదరాబాద్ నుండి చదువుకునేందుకు తిరుపురంకు వస్తాడు. తమిళనాడు నుండి తెలుగు రాష్ట్రంగా ఆధ్ర విడిపోయినప్పుడు ఆ ఊరు మధ్యలో ఉండి గీత వస్తుంది. అందుకే తిరుపురంలో అటు తమిళం, ఇటు తెలుగు వాళ్లు ఉంటారు. ఉన్నవాళ్లు మాములుగా ఉండకుండా ఒకరంటే ఒకరు అసలు పడదు. ఈ క్రమంలో అమ్మాయిని ఇష్టపడతాడు శౌర్య. ఇంతలోనే అదిరిపోయే ట్విస్ట్. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇంతకీ ఆ ఊరు ఎందుకు రెండుగా చీలింది.. ఆ ఊరి సమస్యను హీరో ఎలా పరిష్కరించాడు అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

నాగ శౌర్య హీరోగా చలాకీగా ఇదవరకు చూడని పాత్రలో అలరించాడు. సినిమా అంతా దాదాపు భుజాన వేసుకుని నడిపించాడు. కమర్షియల్ కథ కావడంతో సినిమాలో శౌర్య నటన ఆకట్టుకుంది. ఇక రష్మిక మొదటి తెలుగు సినిమానే అయినా ఆమెను పెట్టుకున్నందుకు పాత్రకు న్యాయం చేసింది. హీరో తండ్రిగా నరేష్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక కమెడియన్స్ వైవా హర్ష, సత్య, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లాంటి వారు కూడా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

ఛలో సినిమా స్టైలిష్ యూత్ ఎంటర్టైనర్ గా ఇంత ఫ్రెష్ గా కనిపించడానికి దర్శకుడు వెంకీ కుడుముల ప్రతిభ కనబడుతుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో దర్శకుడి ప్రతిభ చాటుకున్నాడు. సినిమా కథ, కథనాల్లో కూడా తన పరంగా 100 పర్సెంట్ గుడ్ మార్క్స్ కొట్టేశాడు. ఇక సినిమాకు మరో బలం మ్యూజిక్. సాగర్ మహతి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ బాగుంది. టేకింగ్ అద్భుతంగా తీశాడు. సినిమాకు కావాల్సిన ఫీల్ తన కెమెరా కన్నుతో చూపించాడు. ఎడిటింగ్ ఓకే.. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు అవసరం ఉన్నంత పెట్టేశారు.

విశ్లేషణ :

గొడవల్లో ఇంట్రెస్ట్ చూపించే హీరో ఆల్రెడీ గొడవపడి చీలిన ఓ ఊరి గొడవల్లో తలదూరుస్తాడు. పరిస్థితులు అలా ప్రభావితం చేస్తాయనుకోండి. వాటిని నెగ్గుకుని ప్రేమించిన అమ్మాయిని.. చీలిన ఊరిని ఊకటి చేసే కథే ఈ ఛలో. మొదటి భాగం అంతా చాలాకీగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అసలు పాయింట్ రేజ్ చేశాడు. సినిమా అంతా సరదాగా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సినిమా అంతా ఫుల్ టైం పాస్ గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో నాగ శౌర్య హీరోయిజం కూడా ఆకట్టుకుంది. యువ హీరోగా సత్తా చాటుతున్న నాగ శౌర్య ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేయలేదు. దర్శకుడి ప్రతి ఫ్రేం చాలా అందంగా తీర్చిదిద్దాడు. కాలేజ్ లో సీన్స్ తో పాటుగా లవ్ సీన్స్ కూడా చక్కగా రాసుకున్నాడు.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా ఎక్కడ అంచనాలను తగ్గకుండా సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. సినిమాను దర్శకుడు ఫుల్ ఫన్ ఎలిమెంట్ తో తెరకెక్కించాడు. ఎక్కడ వాయిలెన్స్ అన్నది కనిపించదు. అయితే హంగామా బాగున్నా క్లైమాక్స్ వరకు సినిమా పంథాను మార్చుకోలేదు. ఓవరాల్ గా సినిమా యూత్ ఆడియెన్స్ ను పర్ఫెక్ట్ గా అలరిస్తుందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

కాస్టింగ్

మ్యూజిక్

స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ ల్యాగ్ అవడం

క్లైమాక్స్

బాటం లైన్ :

ఛలో నాగ శౌర్య.. ఆకట్టుకునే ప్రయత్నం..!

రేటింగ్ : 3/5

http://www.telugulives.com/telugu/raviteja-touch-chesi-choodu-movie-review-rating/

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news