Moviesమహేశ్ డ్యూయెల్ రోల్ లో కనిపించిన ఒక్కే ఒక్క సినిమా ఇదే.....

మహేశ్ డ్యూయెల్ రోల్ లో కనిపించిన ఒక్కే ఒక్క సినిమా ఇదే.. ఆయన తల రాతనే మార్చేసిందిగా..!!

చాలామంది హీరోలు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసేటప్పుడు డ్యూయెల్ రోల్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు . డ్యూయల్ షేడ్ లో కనిపించిన ప్రతిసారి ఆ సినిమా హిట్ అవుతుంది అని నమ్మకం .. చాలా మంది హీరోస్ గా ఉంటుంది . ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలు ఎక్కువగా డ్యూయెల్ రోల్స్ లో కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు తన ఇన్నేళ్ల కెరియర్ లో ఒక్కటంటే ఒక్క సినిమాలో డ్యూయల్ పాత్రలో నటించి మెప్పించాడు ఆ సినిమా మరి ఏదో కాదు నాని . ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. దేవయాని రఘువరన్ తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు.

మహేష్ బాబు అక్క మంజులా ఘట్టమనేని ఈ సినిమాను స్వయంగా నిర్మించింది . అప్పట్లో ఈ సినిమా కి మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. కాగా 2004లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది . ఓ వర్గం జనాలకు ఈ సినిమా నచ్చితే చాలామంది జనాలకు ఈ సినిమా నచ్చలేదు . అయితే ఈ సినిమాలో చివర్లో కొద్దిసేపు మహేష్ బాబు తండ్రి కొడుకులు గా డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడు. అది జనాలకు పెద్దగా నచ్చలేదు. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయనకు జోడిగా శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news