Moviesవాట్..బన్నీ జాతీయ అవార్డు ని కొనుకున్నాడా..? బయటపడ్డ సంచలన నిజం..!!

వాట్..బన్నీ జాతీయ అవార్డు ని కొనుకున్నాడా..? బయటపడ్డ సంచలన నిజం..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరే మారుమ్రోగిపోతుంది .దానికి కారణం రీసెంట్గా ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించడమే. కాగా పుష్ప సినిమాకి గాను ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోబోతున్నాడు అల్లు అర్జున్ . 69 ఏళ్లుగా తెలుగు జనాలు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది.

అయితే ఈ విషయం కొందరికి నచ్చడం లేదు . బన్ని ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటే కొంతమంది హీరోల పేర్లు చెప్పుకొని సోషల్ మీడియాలో భజన చేసే ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగా ఉంది . అందుకే బన్నీ జాతియ అవార్డును కొనుక్కున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. పుష్ప సినిమా కన్నా చాలా మంచి సినిమాలు ఇండస్ట్రీలో వచ్చాయి అని పక్క భాష నటులు కూడా ఎంతో చక్కగా నటించారని.. అసలు పుష్ప సినిమాలో ఏముందని బన్నీకి జాతీయ అవార్డు ఇచ్చారని ..? కేవలం గడ్డం పెంచుకొని మాస్ లుక్ లో కనపడితే హీరో అయిపోతాడా..? అని ప్రచారం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు బన్నీ తెరవనక తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో జాతీయ అవార్డును కొనుక్కున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అయితే వీళ్ళకి బన్నీ ఫ్యాన్స్ సూటిగా ప్రశ్న వేస్తున్నారు . పుష్ప సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో అంత కష్టపడి ఆ పాత్రను పోషించగలరు ..గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి ..? అంటున్నారు . అంతేకాదు కోట్ల ఆస్తి ఉన్న ఆయన మట్టిలో దొరలాల్సిన అవసరం లేదు..? మట్టిని మొహానికి పూసుకుని అంత కష్టపడాల్సిన అవసరం బన్నీకి ఏముంది ..? పుష్ప సినిమా చూసిన తర్వాత కూడా మీరు ఇలాంటి డైలాగ్స్ కొడుతుంటే.. మీకున్న జ్ఞానాన్ని మీకే వదిలేస్తున్నాం ..అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి బన్నీ జాతీయ అవార్డుని కొనుక్కున్నాడు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news