పెళ్లి అనేది మనిషి లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ విషయం పెళ్లికాని అబ్బాయిలని అడిగితే అందరూ క్లియర్గా చెప్తూ ఉంటారు . అయితే మన లైఫ్ లో పెళ్లి అనేది చాలా మధురమైన అనుభూతి ..మధురమైన క్షణాలు ఎన్నో ఉంటాయి. మన పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిసిన తర్వాత వచ్చే ఫీలింగ్ ఆ కిక్కే వేరు . అయితే సడన్గా పెళ్లి ఆగిపోతుంది అని తెలిస్తే ఆ బాధ వర్ణాతితం . అలాంటి బాధను ఇండస్ట్రీలో సామాన్య ప్రజలు ఎంతోమంది ఫేస్ చేసి ఉంటారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా అలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మనకు తెలిసిందే అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖని చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళది పూర్తిగా పెద్దలకు కుదిర్చిన వివాహం . కాగా అల్లు రామలింగయ్య గారు సురేఖకు చిరంజీవికు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి నిశ్చితార్ధమైపోయిన తర్వాత కరెక్ట్ గా పెళ్లికి మూడు రోజులు ఉంది అనగా చిరంజీవి గురించి స్టార్ హీరో ఆయన వద్దకు వచ్చి చెడుగా చెప్పారట.
ఆ హీరోకి హీరోయిన్ల పిచ్చి మరి నీ కూతురు ఎలా ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది ..? అంటూ నానా విధాలుగా ఎక్కబోశారట . దీంతో అల్లు రామలింగయ్య ఒక్కక్షణం చిరంజీవి క్యారెక్టర్ ను అనుమానించారట . పెళ్లి క్యాన్సిల్ చేసేద్దామా లేకపోతే నా కూతురు బాధపడుతుందేమో అనుకున్నారట. కానీ ఆ తర్వాత చిరంజీవి రియల్ క్యారెక్టర్ తెలిసి సురేఖ అల్లు రామలింగయ్య గారు కూడా ఆ ఆలోచన నుంచి వెనక్కి వచ్చారట. అంతేకాదు సురేఖ తన కాబోయే భర్త చిరంజీవి గురించి చెప్పిన తీరు అప్పట్లో రామలింగయ్య గారిని ఇంప్రెస్ చేసిందని ..ప్రతి ఆడపిల్లకి అలాంటి నమ్మకం భర్త పై ఉండాలి అని అప్పట్లో చెప్పుకు వచ్చారట . మొత్తానికి చిరంజీవి సురేఖల జంట ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు..!!