Movies"అందరి మెగా హీరోలల్లో ఆ ఒక్కడే జెన్యూన్".. మిగత వాళ్లు బోకులా...

“అందరి మెగా హీరోలల్లో ఆ ఒక్కడే జెన్యూన్”.. మిగత వాళ్లు బోకులా బన్నీ..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని రాద్దాంతం చేసి చూడడం ఎక్కువగా అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా సరే స్టార్ సెలబ్రెటీ ట్వీట్ చేసిన ఇన్స్టాల్ లో పోస్ట్ చేసిన సరే అందులో మంచి కన్నా చెడుని ఎక్కువగా చూస్తున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో అదే ట్రెండ్ అయిపోయింది . రీసెంట్గా అలాంటి ఓ ట్వీట్ చేసినందుకు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు కొందరు మెగా ఫ్యాన్స్ .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. కాగా అల్లు అర్జున్ ను రీసెంట్ గానే జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే . 69వ జాతీయ అవార్డుల ప్రకటనోత్సవంలో ఆయనకు ఉత్తమ నటుడుగా అవార్డు వరించింది. 69 ఏళ్లుగా తెలుగు జనాలు వెయిట్ చేస్తున్న కోరిక కూడా తీరిపోయింది. ఇదే క్రమంలో ఆయనకు పలువురు విష్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్..” నువ్వు ఇలాంటి ఘనత సాధించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది బన్నీ.. నువ్వు అందుకు అర్జుడివి”.. అంటూ చేశాడు.

ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ బన్నీ థాంక్యూ మై డియర్ స్వీట్ జెన్యూన్ కజిన్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక్కడే మ్యాటర్ చేడింది. జెన్యూన్ అంటే మిగతా వాళ్ళందరూ ఏంటి డమ్మీల ..?ఫేకా..? అంటూ కావాలనే కొందరు మెగా ఫాన్స్ ఈ కామెంట్స్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news