Moviesక‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ అప్పుడే అన్ని కోట్ల ఆస్తి కూడ‌బెట్టాడా ?

క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ అప్పుడే అన్ని కోట్ల ఆస్తి కూడ‌బెట్టాడా ?

జబర్దస్త్ – ఎక్స్ ట్రా జబర్దస్త్ – శ్రీదేవి డ్రామా కంపెనీ – ఢీ వంటి ప‌లు షోల ద్వారా బుల్లితెరపై స్టార్ కమెడియన్.. నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. సుడిగాలి సుధీర్. ఈ నటుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి ఏకంగా వెండితెరపై హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్ – గాలోడు వంటి సినిమాలతో హీరోగాను ప్రేక్షకులను అలరించాడు.

sudheer

అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వలేదు. అయితే సుధీర్ నటనకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ హీరో గోట్ సినిమాలో నటిస్తున్నాడు. ఓవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటేనే మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ క్షణం తీరిక లేకుండా రెండు చేతుల సంపాదిస్తున్నాడు.

ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుధీర్ తక్కువ టైంలోనే గట్టిగానే సంపాదించినట్టు తెలుస్తోంది. సుధీర్ కు హైదరాబాదులో ఒక లగ్జరీ ఇల్లు ఉంది. దాంతోపాటు రెండు బైకులు.. రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తన సంపాదనతో రంగారెడ్డి జిల్లాలో గట్టిగానే పొలాలు కూడా కొన్నాడట.

sudheer

సుధీర్ తక్కువ టైం లో గట్టిగా వెనక్కి వేసుకున్నాడని.. అతడు మొత్తం ఆస్తులు విలువ రు. 25 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న సుడిగాలి సుధీర్ సంపాదనకు ఇప్పట్లో బ్రేకులు ప‌డ‌లా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news