Movies"బన్నీకి జాతియ అవార్డ్"..అందరికన్నా స్పెషల్ గా విష్ చేసిన ఎన్టీఆర్.. ఇదే...

“బన్నీకి జాతియ అవార్డ్”..అందరికన్నా స్పెషల్ గా విష్ చేసిన ఎన్టీఆర్.. ఇదే ప్రేమంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉంటారు కానీ ఓ హీరో ఏదైనా ఘనత సాధించినప్పుడు కల్మషం లేకుండా.. ఈగో లేకుండా ఓపెన్ గా జెన్యూన్ గా పొగిడే వాడే రియల్ హీరో అనిపించుకుంటారు . అలాంటి వాళ్ళల్లో టాప్ పొజిషన్లో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ . అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా సరే స్టేటస్ ని ఆలోచించకుండా ఎదుటివారు మంచి పని చేసినప్పుడు మంచి అవార్డ్స్ అందుకున్నప్పుడు మనసారా విష్ చేస్తాడు .

ప్రజెంట్ అలాంటి ట్వీట్ చేసి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారాడు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన ఎంతో అపురూపంగా ముద్దుగా ప్రేమగా బావ అని పిలుచుకునే అల్లు అర్జున్ రీసెంట్గా 69వ జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్టులో టాప్ పొజిషన్లో నిలిచాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు.

ఇండస్ట్రీలో క్రేజీ రికార్డునునెలకొల్పాడు. ఉత్తమ జాతీయ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ని అవార్డు వరించింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇలాంటి ఘనత సాధించినందుకు ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు స్పెషల్ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు . అంతేకాదు నువ్వు దీనికి అర్హుడువి ..కంగ్రాట్యులేషన్స్ బావ అంటూ ఎంతో ప్రేమగా ట్విట్ చేశారు. ఇదే ట్వీట్ ని అల్లు అర్జున్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news