టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ తెలుగులోనే స్టార్ హీరో మారడు విక్టరీ వెంకటేష్.. కలియుగ పాండవులు సినిమాతో 1986లో తన కెరీర్ను ప్రారంభించిన వెంకటేష్ ఇప్పటివరకు తన కెరీర్లో 75 సినిమాల్లో నటించారు వాటిలో ఎక్కువ సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే సమయంలో వెంకటేష్ వదులుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలా వెంకటేష్ వదులుకున్న టాప్ 5 సూపర్ హిట్ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ముందుగా సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన క్లాసికల్ మూవీ రోజా.. వెంకటేష్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ కథ ముందుగా వెంకటేష్ వద్దకే వెళ్లిందట కానీ ఆ సమయంలో వెంకి ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోయాడు. దాంతో అరవిందస్వామి హీరో రోజా సినిమా వచ్చింది. అలాగే వెంకటేష్ వదులుకున్న మరో సూపర్ హిట్ సినిమా సంతోషం.. నాగార్జున హీరోగా దర్శకుడు దశరథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2002లో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమా కథ కూడా ముందు వెంకటేష్ వద్దకే వచ్చిందట ఆయన కూడా ఈ సినిమాను అనుకోని కారణాలతో రిజెక్ట్ చేశారు.
అదేవిధంగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా కూడా ముందుగా వెంకటేష్ దగ్గరికి వచ్చిందట.. అదే సమయంలో వెంకటేష్ కలిసుందాం రా సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో శంకర్ సినిమాను ఓకే చేయలేకపోయాడు.. దాంతో ఒకే ఒక్కడు సినిమా అర్జున్ హీరోగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. వెంకటేష్ వదులుకున్నా మరో హిట్ సినిమా గోవిందుడు అందరివాడేలే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించాడు.
అయితే కృష్ణవంశీ ముందుగా గోవిందుడు అందరివాడే కథను వెంకటేష్ వద్దకు తీసుకువెళ్లగా అయినా ఈ స్టోరీ తనకు సూట్ అవ్వదని నో చెప్పారట. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ మహారాజా రవితేజకు బారీ కంబ్యాక్ ఇచ్చిన క్రాక్
కథ సైతం వెంకీ వద్దకు వెళ్లిందట. కానీ, ఏవో కారణాల వల్ల ఆయన క్రాక్
ను కూడా రిజెక్ట్ చేశారు. ఏదేమైనా ఈ ఐదు సూపర్ హిట్ సినిమాలు వెంకీ చేసుంటే ఆయన రేంజ్ మరోలా ఉండేదని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.