Moviesఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో క‌ళ్యాణ్‌రామ్ పెళ్లికి అడ్డు ప‌డిందెవ‌రు… తెర‌వెనక...

ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో క‌ళ్యాణ్‌రామ్ పెళ్లికి అడ్డు ప‌డిందెవ‌రు… తెర‌వెనక ఏం జ‌రిగింది..!

నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ నేటితరం హీరోలకు గడ్డి పోటీ ఇస్తున్నాడు. అదే సమయంలో నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా దూసుకుపోతుంటే.. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా హీరోగా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు. గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్అ అందుకుని తానేంటో మరోసారి ప్రూవ్ చేశాడు.

ప్రస్తుతం ఈ నందమూరి హీరో డెవిల్ సినిమాతో ప్రేక్షకులు ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా కూడా ఈ సంవత్సరం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈయన 2006లో స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి పెద్దలు కుదుర్చున వివాహం. కళ్యాణ్ రామ్ భార్య వృత్తిరీత్యా డాక్టర్.

ఇకఈమె మంచి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చి నందమూరి ఇంటికి కోడలుగా వచ్చింది. కళ్యాణ్ రామ్- స్వాతీ దంపతులకు ఇద్దరు పిల్లలు.. వారిలో ఒకరు శౌర్య‌రామ్, తాత్విక అద్వైత ,ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. అయితే ఇక్కడ కళ్యాణ్ రామ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.. కళ్యాణ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఓ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడట. సదరు హీరోయిన్ కూడా కళ్యాణ్ రామ్ పై ఎంతో ప్రేమ చూపించిందట.

దాంతో ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యాడు. ఆ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. కానీ హరికృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. హీరోయిన్ తో పెళ్లి వద్దంటూ కొడుకుకు నచ్చచెప్పి ఆ వెంటనే స్వాతి తో కళ్యాణ్ రామ్ కి పెళ్లి జరిపించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికి తెలియదు.. అసలు ఆ హీరోయిన్ ఎవరనేది కూడా బయటికి రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news