Moviesస‌మంత లేక‌పోతేనేం..స‌మంత కంటే ఇద్ద‌రు క‌త్తిలాంటి ఫిగ‌ర్ల‌తో చైతు రొమాన్స్‌…!

స‌మంత లేక‌పోతేనేం..స‌మంత కంటే ఇద్ద‌రు క‌త్తిలాంటి ఫిగ‌ర్ల‌తో చైతు రొమాన్స్‌…!

టాలీవుడ్ యంగ్‌హీరో నాగచైతన్య ఇటీవల కస్టడీ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న చైతు యువ దర్శకుడు చందు మొండేటితో తన తర్వాత సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాను గీత ఆర్ట్స్‌ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. ప్రముఖ తమిళ‌ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి – కీర్తి సురేష్ తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య – సమంత మధ్య ఆసక్తికర పోటీ జరుగుతుంది. విడాకుల తర్వాత చైతు నటించిన సినిమాలు.. అటు సమంత నటించిన సినిమాలు డిజాస్టర్లు అవుతున్నాయి. అయితే సమంత మాత్రం రొమాన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు.

తనకంటే చిన్న హీరోలతో కూడా ఘాటుగా.. హాటుగా నటిస్తోంది. అసలు పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ లో పీక్స్ లో రెచ్చిపోయింది. ఈ ఇద్దరు కూడా అటు సినిమాల పరంగాను.. ఇటు కామెంట్ల పరంగాను ఒకరిని ఒకరు కవ్వించేలా చేస్తున్నారన్న చర్చలు అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి. సమంత లేకపోతేనే సమంతని మించిన కత్తిలాంటి ఫిగర్లు అయిన‌ సాయి పల్లవి – కీర్తి సురేష్ తో ఇప్పుడు చైతు రొమాన్స్‌కు రెడీ అవుతున్నాడని అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సామ్ ఎలా అయితే తెర‌పై రొమాన్స్ విష‌యంలో రెచ్చిపోతుందో.. ఇప్పుడు చైతు సాయి ప‌ల్ల‌వి, కీర్తి సురేష్‌తో న‌టించి సామ్‌ను మించి వాళ్ల‌తో రొమాన్స్ చేస్తాడ‌ని వారు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్ల‌డి కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news