ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి అందరి ఫోకస్ నాగబాబు ఫ్యామిలీ పైనే పడింది . అప్పటివరకు కేవలం నాగబాబును మాత్రమే సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు .
అయితే నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి ఆమెను కూడా జత కలుపుతూ ఇద్దరిని ట్రోల్ చేస్తున్నారు . కాగా జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్గా వివాహం చేసుకున్న నిహారిక వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకునింది . అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగబోతుంది . నిహారిక అన్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు , నవంబర్ ఒకటవ తేదీ గ్రాండ్గా వీళ్ళ వెడ్డింగ్ ఇటలీలో జరగబోతున్నట్లు సమాచారం అందుతుంది .
అయితే ఇలాంటి క్రమంలోనే అన్న వదినలకు నిహారిక క్రేజీ సలహా ఇచ్చిందట . ” పెళ్లి తరువాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని.. మీ ఫ్యామిలీ.. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలను మీ ఇద్దరి మధ్య పెట్టుకోండి ..మూడో వ్యక్తిని మీ మధ్యలోకి రానివ్వకండి ..వస్తే మీ కాపురం కూలిపోతుంది ” అంటూ అన్నకు తన వివాహ బంధం లో జరిగిన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసిందట .
అంతేకాదు మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠి నీ అర్థం చేసుకొని ఆమెను ఆమె లాగా ఉండనివ్వు అంటూ వరుణ్ తేజ్ కు చెప్పుకు వచ్చిందట . అయితే నిహారిక మాటలు విన్న లావణ్య త్రిపాఠి షాక్ అయిపోయిందట, నిహారిక ఇంత పెద్దరికంగా మాట్లాడుతుందా ..? చాలా చిన్న పిల్ల అనుకున్నాం ఇంత మెచ్యూరిటీ ఉన్న అమ్మాయినా..? అంటూ షాక్ అయిపోయిందట . అంతేకాదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే జీవితం పై ఇంత నిజాలను తెలుసుకోగలిగింది అంటూ నిహారికను హగ్ చేసుకుని మరి ఎమోషనల్ గా ఫీల్ అయిందట . మొత్తానికి నిహారిక జీవితంలో జరిగిన తప్పులు వరుణ్ తేజ్ జీవితంలో జరగకుండా బాగానే అన్న వదినలకు సపోర్ట్ చేస్తుంది నీహారిక అంటున్నారు అభిమానులు..!!