సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది హీరోయిన్స్ రెచ్చిపోతున్నారు . విచ్చలవిడిగా హద్దుల మీరి హాట్ ఫోటోషూట్ చేయడమే కాదు అంతకుమించిన రేంజ్ లో అందాలను బోల్డ్ కంటెంట్ ప్రదర్శిస్తూ చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా అదే లిస్టు లోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ అమలాపాల్ . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డస్కి బ్యూటీ అమలాపాల్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే .
ఆ తర్వాత సింగిల్ గా ఉంటున్న అమలాపాల్ కు రెండో పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టిందట . ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది . అమలాపాల్ మాట్లాడుతూ నేను రెండో పెళ్లి చేసుకోవాలి అని చాలామంది అనుకుంటున్నారు. నాకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది . కానీ నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాత్రం బెడ్ రూమ్లో సింహంలా ఉండాలి.. కండలు తిరిగిన వాడై ఉండాలి ..అలాగే నాపై చాలా ప్రేమ జాలి దయ కలిగి ఉండాలి .. నాతో చాలా సరదా సరదాగా ఫన్నీగా ఉండాలి. ఇలాంటి లక్షణాలు దొరికితే మాత్రం కచ్చితంగా నేను రెండో పెళ్లి చేసుకుంటాను “అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది .
అంతేకాదు కాబోయే భర్త విషయంలో నా తండ్రి నాకు ఆదర్శం.. మా నాన్న ఇతరుల పట్ల చాలా దయ జాలితో ఉంటారు ..అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో అమలాపాల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!