Moviesహాట్ కేకుల్లా స‌లార్ టిక్కెట్లు సేల్‌… నెల రోజుల ముందే ఇన్ని...

హాట్ కేకుల్లా స‌లార్ టిక్కెట్లు సేల్‌… నెల రోజుల ముందే ఇన్ని ల‌క్ష‌ల టిక్కెట్లు అమ్ముడ‌య్యాయా..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సగటు సినీ అభిమానులు అందరూ ఎప్పుడా ? అని ఎదురుచూస్తున్న సినిమా సలార్. ఈ సినిమా కోసం ఇండియన్ సినీ జనాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు సాధించినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాయి. ఈ సినిమాలు కొన్నవారికి లాభాలు కూడా తెచ్చి పెట్టలేదు

ఇటీవల రిలీజ్ అయిన ఆది పురుష్‌ సైతం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే అంతే స్థాయిలో రిలీజ్ కు నెల రోజుల ముందు నుంచే సలార్ రికార్డుల మోత మొదలైంది.

ఇటీవల అమెరికాలో సలార్ టిక్కెట్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన‌ కొద్ది క్షణాల్లోని హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఈ న్యూస్‌ను ప్రభాసభిమానులు సోషల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. రిలీజ్‌కు నెల రోజుల‌ ముందే ప్రభాస్ సలార్ మానియా ఈ రేంజ్ లో ఉందంటే ఓవర్సీస్ లో సలార్ కచ్చితంగా కలెక్షన్ల వర్షం కురిపించడం కాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 150 వేల‌ డాలర్ల వసూళ్లు వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

ఒక అమెరికాలోనే ఈ రేంజ్ లో ఫ్రీ బుకింగ్స్ నమోదు అవుతూ ఉండడంతో ఇక ప్రపంచవ్యాప్తంగా కంపేరిజన్ చేసి చూస్తే పాత రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 ఏకంగా త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులు బ్రేక్ చేసి రు. 1250 కోట్ల వసూళ్లు కొల్ల‌ కొట్టింది. ఇప్పుడు సలార్ రెండువేల కోట్ల వసూళ్లు దాటుతుందని ఇండియన్ ట్రేడ్ వర్గాలు నమ్మకం పెట్టుకొన్నాయి.

హోంబ‌లే ఫిలిమ్స్ పతాకం పై విజయ్ కిరంగ‌దూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా పృథ్విరాజ్ సుకుమార‌న్ – జగపతిబాబు – టిను ఆనంద్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 28న స‌లార్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news