Moviesలావ‌ణ్య‌ను అలా చూసిన‌ప్పుడే ప్రేమ‌లో ప‌డ్డా… తొలి ప్రేమ ఎప్పుడో చెప్పిన...

లావ‌ణ్య‌ను అలా చూసిన‌ప్పుడే ప్రేమ‌లో ప‌డ్డా… తొలి ప్రేమ ఎప్పుడో చెప్పిన వ‌రుణ్‌తేజ్‌..!

మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా గాండీవధారి అర్జున. బి. బాపినీడు సమర్పణలో బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. వరుణ్ తేజ్ కి జోడిగా ఏజెంట్ భామ సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమాతో పాటు లావణ్య త్రిపాఠితో తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.

ఈ సినిమాలో హీరో పేరు అర్జున్.. ఓ నటుడుకి సామాజిక బాధ్యతాయుతమైన పాత్రలో నటించే అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి.. అలాంటి బాధ్యతను గుర్తు చేసేలా ఈ సినిమా చేయటం సంతోషంగా ఉందని చెప్పాడు. హీరోయిన్ సాక్షి వైద్యకి చాలా టాలెంట్ ఉందని.. తొలిరోజు షూటింగ్లోనే సినిమాలో మూడు పేజీల డైలాగ్ సింగల్ టేక్ లో చెప్పటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది అని చెప్పాడు.

ఇక లావణ్య త్రిపాఠి తో మీ ప్రేమ ఎప్పుడు ? మొదలైంది అన్న ప్రశ్నకు వరుణ్ మిస్టర్ సినిమా సమయంలో తనని తొలిసారి కలిసినప్పుడే ఆమె మీద ప్రేమ మొదలైంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక మా ఇద్దరి పెళ్లి ఈ యేడాదిలోనే ఉండే అవకాశం ఉంటుందని కూడా వరుణ్‌ చెప్పాడు. వరుణ్ – లావణ్య కలిసి మిస్టర్ – అంతరిక్షం సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news