బాలీవుడ్ కాంట్రవర్సీ హాట్ హీరోయిన్ రాఖీసావంత్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే తన భర్త ఆదిల్ దురానిపై ఆమె మరో ఆరోపణలు చేసింది. అసలు ముందు ఆదిల్ – రాఖీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్ళు దుబాయిలో హనీమూన్ చేసుకున్నారు .అయితే హనీమూన్ టైం లో రాఖిని భర్త న…గ్నంగా షూట్ చేశాడట. అలా షూట్ చేసిన న్యూ.. వీడియోలను దుబాయ్ లో రు. 50 లక్షలు అమ్మేసినట్టు రాఖీ ఆరోపణలు చేస్తుంది.
ఆదిల్.. నేను హనీమూన్ బాగా చేసుకున్నాం. ఆ టైంలో బాత్ డబ్బులో ఉన్నప్పుడు ఆదిల్ కొన్ని వీడియోలు తీశాడు. ఆ తర్వాత బాత్రూంలో న…గ్నంగా స్నానం చేస్తున్నప్పుడు మరికొన్ని వీడియోలు తీశాడు.. అతడితో కలిసి బెడ్ పై ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోలు షూట్ చేశాడు.. ఆ వీడియోలు అన్నింటిని అరబ్ వ్యక్తికి రు. 50 లక్షలకు అమ్మేశాడని తన భర్తపై సంచలన ఆరోపణలు చేస్తుంది రాఖీ.
ఇక పెళ్ళికి ముందు కూడా ఆదిల్ తనను లైంగికంగా వేధించాడని చెప్పింది. ఓరోజు ఆదిల్ చెల్లి నాకు ఫోన్ చేసి కారును బహుమతిగా ఇస్తానని చెప్పడంతో మైసూర్ వచ్చి తీసుకు వెళ్ళమని కోరిందని.. నేను కారు కోసం మైసూర్ కి వెళ్ళగా ఆదిల్ గదిలో ఉన్నాడని చెప్పారని.. నేను లోపలికి వెళ్ళిన వెంటనే బయట నుంచి ఒక వ్యక్తి లాక్ చేసి వెళ్లిపోయాడు.. ఆ టైంలో ఆదిల్ నాపై దాడి చేశాడంటూ ఆమె వాపోయింది.
గదిలోకి వెళ్లిన తర్వాత ఆదిల్ నా దుస్తులు అన్ని చించి వేయడంతో పాటు మూడు గంటల పాటు ఏం చేయాలో అన్నీ చేసి సారీ చెప్పాడని.. తాను గోవాకు వెళితే అక్కడకు కూడా వచ్చి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు అని.. ఆదిల్‌ను తన భర్తగా భావించటం లేదని.. అతడి నుంచి విడాకులు కోరుకుంటున్నట్టు రాఖీ చెప్పింది. మరి ఈ కాంట్రవర్సీ ఎన్ని రోజులకు కొనసాగుతుందో చూడాలి.