Movies"కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోతా"..రౌడి హీరో దమ్ము అంటే ఇది.. ఏం గట్స్...

“కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోతా”..రౌడి హీరో దమ్ము అంటే ఇది.. ఏం గట్స్ రా సామీ..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పేరే మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో విజయ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే . ప్రజెంట్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన ఖుషి అనే సినిమాలో నటించారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా చెన్నైలో ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విజయ్ దేవరకొండ కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని ఓ రేంజ్ లో పొగిడేశారు . ఎంతలా అంటే అనిరుధ్ క్రేజ్ చూస్తుంటే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

జాతీయస్థాయిలో చిన్న వయసులోనే గుర్తింపు సంపాదించుకున్నాడని ..ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటున్నానని ..గతంలో ఆఫర్ వస్తే అది లాస్ట్ మూమెంట్లో మిస్ అయిందని ..ఈసారి అలా మిస్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అయితే అనిరుధ్ ని ఈ రేంజ్ లో పొగిడేయడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది . ఆయనకు అంత సీన్ ఉందా..? అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news