Movies"అదే తప్పు మా ఫ్యామిలీలో జరిగింది"..పవిత్ర - నరేష్ రిలేషన్ షిప్...

“అదే తప్పు మా ఫ్యామిలీలో జరిగింది”..పవిత్ర – నరేష్ రిలేషన్ షిప్ పై కొడుకు షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో నరేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు సినిమాలో హీరోగా చేసిన ఈయన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో విలన్ గా జనాలను మెప్పించే పాత్రలో నటించి మెప్పించారు . కాగ ఈ మధ్యకాలంలో పర్సనల్ ఇష్యూస్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు . నరేష్ కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం నడుపుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు.

కాగా ఇదే ఇష్యూ పై ఫస్ట్ టైం నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ స్పందించారు . రీసెంట్ గాని సాయి ధరమ్ తేజ్ తో సత్య అనే వీడియో సాంగ్ రూపొందించిన ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తండ్రి నరేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే తన తండ్రిని పొగుడుతూనే తన ఫ్యామిలీలో కొన్ని తప్పులు జరిగాయి అని ఓపెన్ గా ఒప్పేసుకున్నాడు .

ఆయన మాట్లాడుతూ..” అందరి ఫ్యామిలీలో లాగే మా ఫ్యామిలీలో కొన్ని తప్పులు జరిగాయి.. అయితే మా నాన్న తప్పు చేశాడా ఒప్పు చేశాడా..? అని పక్కన పెడితే మా నాన్న హ్యాపీగా ఉన్నాడా ..? లేదా..? అదే ఇంపార్టెంట్ . మిగతా వాళ్ళు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ ..పవిత్ర లోకేష్ తో నాకు పరిచయం ఉంది . ఆమె చాలా చాలా మంచి వ్యక్తి . నన్ను అన్ని ప్రాజెక్టు లు చేసే విధంగా పవిత్ర గారు సపోర్ట్ చేసారు . నేను పవిత్ర గారు అంటూ ఎంతో గౌరవంగా పిలుస్తాను.. ఇక జనాలు వీళ్ళ గురించి ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ “అంటూ చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో నవీన్ విజయ్ కృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news