Moviesఅయ్యయ్యో.. ఇప్పటికి మహేశ్ బాబు కి ఆ కోరిక తీరలేదా..? పాపం..!

అయ్యయ్యో.. ఇప్పటికి మహేశ్ బాబు కి ఆ కోరిక తీరలేదా..? పాపం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ ఎలాంటి స్థానంలో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన లాస్ట్ గా నటించిన సర్కారీ వారి పాట సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ప్రెసెంట్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్స్ ప్రాజెక్ట్ కు సైన్ చేసాడు .

ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరీర్ లో ఇంతవరకు తన డ్రీం ప్రాజెక్ట్ ని నటించలేదట . ఆయనకు నాగార్జున లాగా ఓ భక్తి రస చిత్రంలో నటించాలని కోరిక ఉండేదట. రాజకుమారుడు సినిమాలో కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే కృష్ణుడిలాగా గెటప్ వేసారని .. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ ఛాన్సే రాకుండా పోయిందని ..ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .

అంతేకాదు కచ్చితంగా ఆయన కెరియర్ లో ఒక్కటైనా సరే దేవుడికి సంబంధించిన పాత్ర పోషించి జనాల దగ్గర మెప్పించుకోవాలి అనే కోరిక ఆయనకి ఇప్పటికీ అలాగే ఉండిపోయిందట. అయితే మహేష్ బాబు ఫిజిక్ కి కటౌట్ కి ఎవరు కూడా మేకర్స్ అలాంటి కథను ఇప్పటివరకు ఆయన దగ్గరకు తీసుకెళ్లనే లేదట . చూడాలి మరి భవిష్యత్తులో నైన మహేష్ బాబు కోరికను ఎవరైనా డైరెక్టర్ తీరుస్తారో లేదో ..?ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news