Moviesఅప్పుడే అకిరాకి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన పవన్ ఫ్యాన్స్.. అమ్మాయి...

అప్పుడే అకిరాకి హీరోయిన్ ని ఫిక్స్ చేసిన పవన్ ఫ్యాన్స్.. అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జనరేషన్ మారిపోతుంది . ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న కొడుకులు కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి బెర్త్ ను కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని .. తమ ప్లేసులను కన్ఫర్మ్ చేసుకున్నారు . కాగ ఇదే క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు పిచ్చెక్కించే గుడ్ న్యూస్ వచ్చేసింది .

రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాడు . తనలోని యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి అమెరికా వెళ్లి మరి తనలోని నటన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు . ఇదే విషయం రెండు రోజులులుగా వైరల్ అవుతుంది. అయితే అలాంటిది ఏం లేదని..అలా ఉంటే నేనే చెప్తానని రేణు దేశాయ్ అభిమానులకు సోషల్ మీడియా ద్వార తెలియజేసింది.

అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అప్పుడే అఖీరానందన్ కి హీరోయిన్ ని వెతికేస్తున్నారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ కూడా సెట్ అవ్వదు అని.. అఖీరా కోసం కొత్త ఫిగర్ ని రంగంలోకి దించాలని కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు పలువురు ఫాన్స్ లయ కూతురైతే అకిరాకి పర్ఫెక్ట్ జోడి అని .. ఆమె హైట్ కి వెయిట్ కి అకిరా లుక్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని లయ ఒప్పుకొని తన కూతుర్ని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే మాత్రం వీళ్ళిద్దరి కాంబో కేక పెట్టిస్తుందని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అకిరానందన్ పేరు మరోసారి వైరల్ గా మారింది . అయితే అకిరానందన్ ఇండస్ట్రీలోకి రావాలంటే కచ్చితంగా రెండు మూడేళ్లు పైన పడుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news