బాలీవుడ్ భామ రాఖీ సావంత్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో తీవ్రమైన ఒత్తిడికి గురైన రాఖీ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటుంది. గతంలో ఆమె తన భర్త ఆదిల్ ఖాన్ దురానీ నుంచి విడాకులు ఆ తర్వాత అమ్మ మరణంతో బాగా కుంగిపోయింది. రాఖీ తన మాజీ భర్త ఆదిల్‌పై కేసు పెట్టడంతో రిమాండ్ కి వెళ్లి తిరిగి వచ్చాడు. తాజాగా ఆదిల్ తన మాజీ భార్య రాఖీ గురించి సంచలన కామెంట్లు చేశారు.
రాఖీ తనపై అన్యాయంగా కేసు పెట్టిందని చెప్పడంతో పాటు ఆమె చాలా ప్రమాదకరమైన మహిళ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాఖీ తనకు పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేసిందని తనకంటే ముందే రితీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోలేదని ఆరోపించాడు. ఆదిల్ మాట్లాడుతూ ఆమెతో మాట్లాడటం కూడా చాలా ప్రమాదకరం.. ఎందుకంటే మహిళలు ఏదైనా చేయగలరు రే..* అని అరిచినా మమ్మల్ని అరెస్టు చేసే విధంగా మన రాజ్యాంగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది.
అంతేకాకుండా రితేష్ తో కలిసి రాఖీ నన్ను మోసం చేసింది. అతనితో పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి విడాకులు తీసుకోకుండానే నాతో బంధాన్ని కొనసాగించింది. తనతో ఉంటూనే నాతో బంధాన్ని కొనసాగించింది అంటూ ఘాటు విమర్శలు చేశాడు. అంతేకాకుండా శారీరకంగా తనను హింసించిందని తన శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ ఒక వీడియో రికార్డింగ్ కూడా ప్రదర్శించాడు. వయసులో ఆమె కంటే చిన్నవాడిని అయినా దుబాయ్ లో ఆమె కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చుపెట్టినట్టు వెల్లడించాడు.’
దుబాయిలో ఒక ప్లాట్, బిఎండబ్ల్యూ కారు, నగలతో పాటు ఖరీదైన బహుమతులు కొనిచ్చానని అంతేకాకుండా రాఖీ నాకు తెలియకుండానే నా అకౌంట్ నుంచి ఐదు కోట్లు విత్ డ్రా చేసిందని ఆరోపించాడు. ఇక తనపై తప్పుడు ఆరోపణలతో అత్యాచారం కేసు పెట్టిందని ఆమె వల్ల నా జీవితం గందరగోళంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అలాగే రాఖీ తనకు డ్రగ్స్ అలవాటు చేసి న్యూడ్ వీడియో తీసిందని ఆదిల్ ఆరోపించాడు. తన తల్లికి క్యాన్సర్ పేరుతో ప్రజలను దోచుకుందని తల్లికి ఆరోగ్యం బాగోలేదని ప్రతినెల రూ.2 లక్షల వరకు విరాళాలు సేకరించేదని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆదిల్ కామెంట్స్ సోషల్ మీడియలో హాట్ టాపిక్ గా మారాయి.