టాలీవుడ్ హీరోలు తీసుకొనే రెమ్యూనరేషన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళ మెయింటినెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కాళ్ళకు వేసుకొని చెప్పుల నుంచి తలపై పెట్టుకునే టోపీ వాళ్ళు వేసుకునే వస్త్రాలు వల్ల కాస్ట్యూమ్స్ ఇలా అన్ని చాలా హై క్లాస్ లో ఉంటాయి. అన్నింటిలోనూ ది బెస్ట్ ఉంటారు. సెలబ్రిటీలు అయితే వాళ్ళు వేసుకునే వస్త్రాల ధరలు ఒక్కోసారి గెస్ చేయటం కూడా చాలా కష్టం. ఒక్కోసారి ఆ రేట్లు చూస్తేనే మనకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి.
తాజాగా మహేష్ బాబు మీడియా ముందుకు వచ్చారు. గుంటూరు కారం సినిమా ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మహేష్ ఎప్పటిలాగానే చాలా సింపుల్ గా కూల్ గా మీడియాకు ఆన్సర్లు వేశారు. మహేష్ బాబు వేసుకున్న దుస్తులు మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటాయి. నిన్న జరిగిన ఫంక్షన్ లో మహేష్ వేసుకున్న చొక్కా ఖరీదు అక్షరాల రూ.18 వేల రూపాయలు అట. ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన షర్ట్ అది.
మహేష్ యాక్సెసరీస్, దుస్తులపై చర్చ ఇప్పటిది కాదు. మహేష్ ప్రతి సినిమా విషయంలోనూ ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. భరత్ అనే నేను సినిమా కోసం మహేష్ వైట్ షర్ట్ వేసుకున్నాడు. అప్పట్లో దానిపై ఒక రేంజ్ లో చర్చ జరిగింది. ఇక మహర్షి సినిమాలో కాలేజీ ఎపిసోడ్లో మహేష్ వేసుకున్న దుస్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఇప్పుడు వేసుకున్న చొక్కా కూడా గుంటూరు కారం కోసం వాడుతున్న డిజైన్లలో ఒకటి అని సమాచారం. మొన్నటికి మొన్న బ్రో సినిమా కోసం పవన్ కళ్యాణ్ వేసుకున్న వెరైటీ షూస్ కూడా హాట్ టాపిక్ గా మారింది. దాని రేటు చూసి జనం నోరెళ్లపెట్టారు. ఇప్పుడు మహేష్ వేసుకున్న చొక్కా రేటు కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.