సాధారణంగా కొందరికి కొన్ని కొన్ని పాడు అలవాట్లు ఉంటాయి. అయితే వాటిని మానుకోవడం చాలా చాలా కష్టం . ఎంతలా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలు కూడా అలాంటి అలవాట్లను కొన్నిసార్లు మానుకోలేరు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ అనుష్క . కన్నడ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కాగా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అనుష్క ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే అనుష్క తన కెరియర్ లో హిట్లు ఫ్లాప్ లు అనే సంబంధం లేకుండా సినిమాలు చేసిన సరే ఇప్పటికి స్టార్ హీరోయిన్ గానే ఇండస్ట్రీలో పిలిపించుకుంటుంది . అలాంటి అనుష్క కి ఓ దరిద్రమైన అలవాటు ఉందనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎస్ చాలామందికి చేతి వేలి గోర్లను తినే అలవాటు ఉంటుంది . ఇది చాలామంది ఆడపిల్లలకు మగ పిల్లలకు కామన్ గా కనిపిస్తుంది .
అయితే అనుష్కలాంటి స్టార్ సెలబ్రిటీ కూడా ఇలాంటి దరిద్రమైన అలవాటు ఉందా అనేది ఇప్పుడు వైరల్ గా మారింది . అయితే ఆమె ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది నిజమే అని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . జనరల్‌గా ఆడపిల్లలు గోర్లు అలా తినకూడదని.. దరిద్రం పట్టుకుంటుంది ఇంట్లోని పెద్దలు చెప్తూ ఉంటారు . అందుకే అనుష్కకి ఇంకా పెళ్లి కాలేదు.. అలాంటి దరిద్రం అయిన అలవాటు పెట్టుకుని అంటూ కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!