సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి రావడం చాలా కామన్ . అలాగే హీరోగా కాకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రావు రమేష్ . చాలామందికి రావు రమేష్ ఎవరో తెలియదు. రావు రమేష్ అంటే మల్టీ టాలెంటెడ్ నటుడు అని మాత్రమే అనుకుంటారు . కానీ ఆయన ఒకప్పటి నటుడు దివంగత రావు గోపాల్ రావు తనయుడు అన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. తండ్రి నటన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రావు రమేష్ .. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు .
సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ తన టైమింగ్ తో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ రావు రమేష్ అన్న సంగతి మనం మర్చిపోకూడదు . కాగా సౌత్ లో మోస్ట్ బిజియస్ట్ ఆర్టిస్ట్ల్లో రావు రమేష్ ఒకరు . ఎటువంటి పాత్రల్లో అయినా లీనమైపోయినటించడం ఈయన స్పెషాలిటీ. కాగా శ్రీకాకుళంలో రావు రమేష్ జన్మించాడు .చెన్నైలో పెరిగాడు . నటుడు అవ్వాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదట . అసలు నటనపై ఇంట్రెస్ట్ లేదు.
మధ్యలో చదువు ఆపేసిన రావు రమేష్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకున్నాడు . అయితే ఈ క్రమంలోనే క్యాలిఫోర్ని అకాడమీలో మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ యానిమేషన్ లో కూడా ఒక కోర్స్ దరఖాస్తు చేసుకున్నాడు . కానీ అప్పుడే నాన్న గారు గోపాల్ రావు మృతి చెందారు . దీంతో తల్లి నటన వైపు అడుగులు వేయమని బలవంతం చేసిందట . కానీ ఇష్టం లేని దాంట్లో ఉండలేము అని ఉద్యోగం కోసం కూడా చాలాసార్లు వెతికాడు.. ఎటువంటి ఉద్యోగం దొరకలేదు.. అయితే నిర్మాణం వైపు అడుగులు వేయాలని నిర్మాతగా మారాలని ఓ ప్రముఖ నిర్మాతతో ఒక సినిమాను స్టార్ట్ చేశారు.. అది మధ్యలోనే ఆగిపోయింది నష్టం కూడా వచ్చింది .
ఆ తర్వాత చెన్నైలో పుట్టగొడుగుల బిజినెస్ స్టార్ట్ చేయగా అది కూడా ప్లాప్ అయింది . చివరకు ఇక తల్లి చెప్పిన మాట విని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు . ఎవరు ఊహించని విధంగా ఆయనకు ప్రజలు నీరాజనం పలికారు . ఆయన నటన కు మంత్రముగ్ధులు అయిపోయారు. ఆయన్ను స్టార్ గా చేశారు . వెండితెరపై కొత్త బంగారులోకంతో ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఆయన వెనకకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు . ఇప్పటికి ఇండస్ట్రీలో స్టార్ హీరోకి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావు రమేష్ కి ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు..!!