టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు – ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 21 నుంచి ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ సారధ్యంలో ఈ సినిమా కోసం హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కథ ప్రకారం మహేష్ బాబు గుంటూరు డాన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం.
సిటీలో జరిగే అన్యాయాలు.. అక్రమాలపై పోరాడుతున్న ఓ మహిళా జర్నలిస్టు ప్రేమలో మహేష్ బాబు పడతాడని.. దీంతో ఆమెను కొందరు టార్గెట్ చేయడంతో ఆమె చిక్కుల్లో పడుతుంది. ఆమె లక్ష్యానికి ఆ డాన్ ఎలా ? అండగా నిలబడ్డాడు అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ఇక సర్ ప్రైజ్ తో మహేష్ బాబు క్యారెక్టర్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది.
జర్నలిస్టు పాత్రలో మీనాక్షి చౌదరి.. మహేష్ బాబు మరదలుగా శ్రీ లీల కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ – సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.