Moviesఇన్నాళ్లు మా ప్రేమ‌ను అందుకే దాచాం… లావ‌ణ్య‌తో ఆ సీక్రెట్ రివీల్...

ఇన్నాళ్లు మా ప్రేమ‌ను అందుకే దాచాం… లావ‌ణ్య‌తో ఆ సీక్రెట్ రివీల్ చేసిన వ‌రుణ్‌

మెగా హీరో వరుణ్ తేజ్ – సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని ఎట్టకేలకు పెళ్ళికి రెడీ అవుతున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ప్రస్తుతం గాంఢీవ‌దారి అర్జున సినిమా ప్రమోషన్లలో వరుణ్ తేజ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వరుణ్ – లావణ్య ప్రేమలో ఉన్నట్టు చాలాసార్లు వార్తలు వినిపించాయి. అయితే వీటిని పుకార్లుగా తేల్చి పారేస్తూ వచ్చిన ఈ జంట అనూహ్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో తన ప్రేమ కథ వెల్లడించారు. లావణ్యతో తన ప్రేమ కథ మొదలై ఐదేళ్లు దాటిపోయిందని.. ముందు ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని.. తర్వాత అభిరుచులు అభిప్రాయాలు కలపడంతోనే తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. తనకు ఉన్న మంచి స్నేహితులలో లావణ్య ఒకరు అని.. తానే ముందుగా లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేసినట్లు వరుణ్ చెప్పాడు.

తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగానే ఇరుకుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదని.. తమ నిర్ణయాలని వారు గౌరవించినట్టు వరుణ్ చెప్పాడు. లావణ్య ఇప్పటివరకు త‌న‌కు చాలా గిఫ్టులు ఇచ్చిందని.. ప్రస్తుతం తాను వాడే ఫోన్ కూడా లావణ్య గిఫ్ట్ గా ఇచ్చింది అని వరుణ్ తెలిపాడు. నాకు ఏది ఇష్టమో లావణ్య కు బాగా తెలుసు.. లావణ్య చాలా కేరింగ్ పర్సన్ అని చెప్పాడు.

అయితే ఇన్నాళ్లు తమ ప్రేమ విష‌యం దాచిపెట్టడానికి కారణం కూడా వరుణ్ వెల్లడించాడు. పర్సనల్ లైఫ్ ఎప్పుడు పర్సనల్గా ఉంచటానికి తన ఇష్టపడతానని.. అందుకే ఇన్నాళ్లు తమ ప్రేమ విషయంలో సైలెంట్ గా ఉన్నామని.. ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి కూడా సింపుల్గా చేసుకుంటామంటూ వరుణ్ తేజ్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news