సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రెసెంట్ ఎలాంటి టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుని ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన్నా.. ప్రజెంట్ తెలుగు – తమిళ్ – హిందీ భాషల్లో టాప్ హీరోయిన్గా మారిపోయింది . అయితే స్టార్ హీరోయిన్ కావడంతో రష్మిక మందన్నాకు సంబంధించిన చిన్న విషయాన్ని సైతం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అభిమానులు .
ఈ క్రమంలోనే రష్మిక మందన పెళ్లి ఆగిపోవడానికి నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల అని అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం లేకపోనూలేదు రష్మిక మందన్నా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఛలో సినిమాని మొదట హీరోయిన్గా అనుకున్నింది శ్రీలీలనే. అయితే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక కథ నచ్చినా శ్రీ లీల ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది.
అదే టైంలో లడ్డులా ఆఫర్ ని పట్టేసుకుంది రష్మిక . ఈ సినిమా ద్వారానే అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో పాగ వెయ్యగలిగింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . ఒకవేళ ఆరోజు శ్రీ లీలా కనుక ఆ సినిమాని ఒప్పుకొని ఉంటే రష్మికకు ఆఫర్ వచ్చిండేదే కాదు .. పాన్ ఇండియా స్టార్ట్ అయ్యేదే కాదు.. శుభ్రంగా కమిట్ అయిన నిశ్చితార్ధాని పెళ్ళి వరకు తీసుకెళ్లి ఇప్పుడు పిల్లాపాపలతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేసేది . తెలిసో తెలియకో శ్రీలీల తీసుకున్న నిర్ణయం ఆమెకు మంచి పని చేసింది.. లైఫ్ లో మాత్రం నెగిటివ్ రిమార్క్ అలాగే మిగిల్చింది. దీంతో రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం శ్రీలీలా అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు..!!