News' స‌లార్ 1 ' ర‌న్ టైం ఎన్ని నిమిషాలంటే... చాలా...

‘ స‌లార్ 1 ‘ ర‌న్ టైం ఎన్ని నిమిషాలంటే… చాలా పెద్ద సినిమా…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సలార్. కేజిఎఫ్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ ఇమేజ్ ఇండియా వైజ్‌గా ఏ లెవెల్లో… ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే బాహుబలి – సాహో – ఆదిపురుష్‌ సినిమాలతో నేషనల్ లెవెల్ లో స్టార్ హీరోగా మారిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స‌లార్ సినిమా కోసం ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా వచ్చేనెల 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. మరోవైపు సలార్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఏకంగా ఆకాశాన్ని అంటుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ రేట్లు చుక్క‌ల నంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా రన్ టైం పై ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

సలార్ ర‌న్ టైం ఏకంగా మూడు గంటలకు పైగానే దాటి ఉన్నట్టు తెలుస్తుంది. మూడు గంటల 20 నిమిషాల రన్ టైం అంటే 200 నిమిషాల రన్ టైం రాగా… ఇందులో 10 నిమిషాల వరకు కట్ చేసి పార్ట్ వన్ ఫైనల్ రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తోంది. అంటే స‌లార్ 1 ర‌న్ టైం 185 – 190 నిమిషాల మ‌ధ్య‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక రవి బ్ర‌సూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news