సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు భళే విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఒక డైరెక్టర్.. ఒక రైటర్ స్టోరీ రాసుకుంటున్నప్పుడు కానీ ఏదైనా ఊహించుకుంటున్నప్పుడు కానీ మైండ్ లోకి రకరకాల ధాట్స్ వస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సుకుమార్ సైతం తన సినిమాలో ఫన్నీ ఫన్నీ డైలాగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు . పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
“పుష్ప పుష్పరాజు నీ అవ్వ తగ్గేదేలే ” ఈ డైలాగ్ ఇప్పటికే ఇండస్ట్రీలో సినిమా స్టార్స్ కామన్ పీపుల్స్ యూస్ చేస్తూనే ఉన్నారు . ఇలాంటి క్రమంలోనే అసలు ఈ డైలాగ్ ఎలా సుకుమార్ రాసుకోచ్చాడు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలి అని అనుకున్నప్పటి నుంచి సుకుమార్ మంచి స్టోరీ ..ఇప్పటివరకు తెరపై చూడని రియలిస్టిక్ గా ఉండే స్టోరీ ని చూపించాలనుకున్నారట .
ఇదే క్రమంలో పుష్ప కధను రెడీ చేసుకున్నారు. కాగా కథను రాసుకుంటున్న టైంలో ఆయన పలు ప్రదేశాలను సెర్చ్ చేసి మరి సినిమా లో డైలాగ్స్ రాసుకున్నారట. ఈ క్రమంలోనే చిత్తూరు కి సైతం వెళ్లారు . అక్కడ ఓ అరుగు పై కూర్చొని కథ రాసుకుంటున్న టైం లోనే అక్కడ ఓ పెద్ద గొడవ జరిగింది. సాధారణంగా గొడవ పడుతున్నప్పుడు బూతు మాటలు మాట్లాడుకుంటుంటారు..అది తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ గొడవ పడుతున్న ఇద్దరు కూడా పచ్చి బూతులతో తిట్టుకుంటూ ఉన్నారట .అంతేకాదు ఆ క్రమంలోని “నీ యవ్వ” అంటూ “నేను తగ్గను..నువ్వే మూసుకుని
పో”.. అంటూ రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకున్నారట . అదే క్రమంలో సుకుమార్ సైతం ఆ డైలాగ్స్ ని తన సినిమాలో వాడేలా ముందు పుష్ప రాజు పేరు ని యాడ్ చేసి ఆ డైలాగులు క్రియేట్ చేశారట . మొత్తానికి అక్కడ వాళ్ళిద్దరూ పడిన గొడవ పుష్ప సినిమాలో ఓ డైలాగ్ సెన్సేషన్ గా క్రియేట్ చేయబడింది . ఒక డైరెక్టర్స్ ఉండాల్సిన లక్షణం కూడా అదే అంటున్నారు జనాలు . అలా క్రియేటివిటీ ఉంటే సినిమా ఇండస్ట్రీ మరింత టాప్ స్థానానికి వెళుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!