భారీ అంచనాలతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా తీసిన నిర్మాత అనిల్ సుంకర మరోసారి నిండామునిగిపోయారు. ఈ యేడాది ఏప్రిల్‌లో అక్కినేని అఖిల్ హీరోగా అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాతోనే అనిల్ బాగా దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు భోళాశంకర్ సినిమాతో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.
అఖిల్ ఏజెంట్ బడ్జెట్ దాదాపు రూ .70 కోట్లు. ఏజెంట్ కేవలం రూ .12 కోట్లు మాత్రమే రాబట్టింది. ఏజెంట్ సినిమాకు ఏకంగా దాదాపు రూ.55 కోట్లు నష్టం వచ్చింది. ఇక బోళాశంకర్ సినిమాకు మొత్తం రు. 90 – 95 కోట్ల రేంజ్ బడ్జెట్ అయ్యింది. ఫస్ట్ డే రూ .28 కోట్లు రాగా మరో రు. 75 కోట్లు వస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరో రు. 15 కోట్లు కూడా రావడం కష్టమే అంటున్నారు.
అంటే ఓవరాల్‌గా ఏజెంట్‌తో రు. 55 కోట్లు, భోళాశంకర్‌తో రు. 60 కోట్లు అంటే రు. 115 కోట్ల వరకు అనిల్ సుంకర ఈ రెండు సినిమాల దెబ్బతో నష్టపోయారు. ఇంకా చెప్పాలంటే భోళాశంకర్ శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోలేదు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో సినిమా నిర్మాతగా, టాప్ డిస్ట్రిబ్యూటర్‌గా తన ఆధిపత్యం చెలాయించే ఓ అగ్ర నిర్మాత అనిల్ సుంకర పరిస్థితి చూసి మాంచి ఖుషీగా ఉన్నాడన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అనిల్ సుంకర కూడా తనకు పోటీగా పెద్ద హీరోలకు భారీగా అమౌంట్లు ఇస్తూ వారి డేట్లు బ్లాక్ చేస్తోన్న పరిస్థితి. దీంతో సదరు అగ్ర నిర్మాతకు ఇటీవల కాలంలో పెద్ద హీరోలు ఎవ్వరూ డేట్లు ఇవ్వడం లేదు. ఇటు అనిల్ సుంకర, అటు మైత్రీ వాళ్లో లేదా మరొకరో భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే సదరు అగ్ర నిర్మాత డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయిన మైత్రీ వాళ్లను గట్టిగా టార్గెట్ చేశారన్న టాక్ ఉంది.
ఇక ఉత్తరాంధ్రలో సదరు నిర్మాతకు ప్రధాన పోటీదారుగా ఉన్న గాయత్రి సతీష్ ఏజెంట్ దెబ్బతో కుదేలవ్వడంకు ఆయనకు పోటీ లేకుండా పోయింది. అటు నైజాంలో వరంగల్ శీను కుదేలవ్వడం కూడా ఆయనకు ఎదురు లేదని సంబరాలు చేసుకుంటున్నాడట. ఇప్పుడు అనిల్ సుంకర ఇక పెద్ద ప్రాజెక్టులు చేయలేడని పిచ్చ పిచ్చగా సంబరాలు చేసుకుంటూ ఆనందంతో గెంతులేస్తున్నాడన్న గుసగుసలు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.