తెలుగు సినీ ప్రపంచంలోనేకాకుండా.. తమిళ, కన్నడ భాషల్లోనూ తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకు న్న శ్యామల.. తర్వాత.. కాలంలో పావలా శ్యామలగా పేరు స్థిరం చేసుకున్నారు. క్యారెక్టర్ పాత్రలకు అందునా.. అతిథి పాత్రలతో పరిచయం అయిన.. శ్యామల ఒక్కొక్క మెట్టు ఎదిగారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతంలో ఉన్న తాడికొండ నియోజకవర్గానికిచెందిన శ్యామల గాయకురాలు.
అంతేకాదు.. జానపద నాటికలు వేసేవారు. ఇలా.. తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యారు. కోడి రామ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన.. ఓ ఓల్డ్ సినిమాలో మూర మల్లెపూలు పావలా..! అనే డైలాగు హిట్టయింది. సినిమా అంతా కూడా ఆమెకు ఉన్న ఒకే ఒక్క డైలాగ్ ఇది. అప్పటి నుంచి ఆమె పావలా శ్యామలగా గుర్తింపు తెచ్చుకున్నారు. డిగ్రీ వరకు చదివిన శ్యామల. అప్పట్లో టీచర్ ఉద్యోగానికి ట్రై చేసి.. ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాయించుకున్నారు.
కానీ, ఇంతలోనే ఆమెకు సినిమాల నుంచి ఆఫర్లు రావడం.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో సినిమాలవైపు మొగ్గు చూపించి ఉద్యోగం వదులుకున్నారు. ఆమెకు ఉన్న చదువు కారణంగా.. అనేక మందికి ఆమె అకౌంటెంట్‌గా పనిచేయడం విశేషం. అయితే.. ఎవరి దగ్గరా చేయి చాపకుండా. ఆమె పని చేశారు. సినిమాల్లో బాగానే సంపాయించినా.. భర్త మరణం, కుమార్తెకు ప్రమాదం జరిగిన తర్వాత.. ఖర్చులు పెరిగిపోవడం ఉన్నదంతా ఖర్చయిపోయింది.
దీంతో ఆమె ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. చిరంజీవి ఈమె పరిస్థితిని గమనించి.. 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకున్నారు. అయితే.. అనివార్య కారణాలతో ఆ సొమ్మును ఆమె మరుసటి నెలలోనే రద్దుచేసుకుని తీసుకున్నారు. దీంతో సొమ్ము అయిపోయింది.. కానీ, కష్టాలు మాత్రం తీరలేదని ఆమె చెప్పుకొచ్చారు.