మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తనకెక్కిన భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. చిరు తన తర్వాత సినిమాగా కురసాల కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తన పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకోనుంది.
ఇక త్వరలోనే చిరుకు ఆపరేషన్ జరగనుంది. సహజంగా వయసు మీద పడ్డాక ఎవరికి అయినా మోకాలు సర్జరీ అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. పైగా విపరీతంగా ఫైట్లు, జంపులు, డ్యాన్సులు చేసే హీరోలకు ఇది కామన్. ఈ క్రమంలోనే చిరంజీవికి కూడా ఇప్పుడు మోకాలు సమస్య ఉందట. అయితే చిరు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా రోజుల నుంచి ఈ ఆపరేషన్ పెండింగ్లో ఉంచుతున్నారు. ఇక ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
అయితే ఇది హైదరాబాదులో చేయిస్తారా ? లేదా విదేశాల్లోనా లేదా మనదేశంలోనే ముంబై లేదా ఢిల్లీలోనా అన్నది క్లారిటీ లేదు. ఈ విషయం ఆయన ఫ్యామిలీకి మాత్రమే తెలుసు అని.. దీనిని పూర్తిగా సీక్రెట్ గా ఉంచుతున్నారని తెలుస్తోంది. చిరు సర్జరీ మరో రెండు మూడు రోజుల్లోనే ఉంటుంది అని.. సర్జరీ తర్వాత నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకుంటారని.. ఆ తర్వాతే మళ్ళీ సినిమా మీదికి వస్తారని తెలుస్తోంది.