సినిమా ఇండస్ట్రీలో ఒక్కో కథని ఒక్కొక్క హీరోకి ఊహించుకొని రాసుకుంటూ ఉంటారు డైరెక్టర్లు – మేకర్లు . అయితే కొన్నిసార్లు ఆ హీరో తో కానీ హీరోయిన్ తో కానీ తెరకెక్కించలేకపోవచ్చు . రీజన్ ఏదైనా కానీ కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడం కారణంగా ..లేకపోతే రెమ్యూనరేషన్ విషయంలో ఏవైనా మిస్ అండర్స్టాండింగ్ కారణంగా .. రీజన్ ఏదైనా సరే అలా ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండటం సర్వసాధారణం.
ఒక హీరోయిన్ అనుకున్న తర్వాత ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ అనుకోవడం కూడా కామన్. అలాగే ఓ లక్కీ డిజాస్టర్ నుంచి తప్పించుకునింది మహానటి కీర్తి సురేష్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారడానికి ట్రై చేస్తున్న అక్కినేని నాగచైతన్య లాస్ట్ గా నటించిన చిత్రం “కస్టడి”. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాతో మరోసారి వీళ్ళ జంట.. హిట్ పెయిర్ గా నిలవబోతోంది అంటూ జనాలు భావించారు.
ఈ సినిమా తుస్సు మంటూ బ్లాక్ బస్టర్ కాకుండా డిజాస్టర్ గా మారింది . దీంతో కృతి శెట్టి కెరియర్ మరింత డౌన్ ఫాల్ అయింది . అయితే ఈ పాత్రలో మొదటిగా డైరెక్టర్ కీర్తి సురేష్ ని అనుకున్నారట . కానీ అమ్మడు కధ వినగానే ఈ సినిమా ఏదో తేడా కొడుతుంది అంటూ కాల్ షీట్లు లేవని నెమ్మదిగా చేతులు దులిపేసుకునిందట. ఏ మాటకామాట ఈ సినిమాను మిస్ చేసుకుని కీర్తి సురేష్ మంచి పని చేసింది..!!