మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కిన భోళాశంకర్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తమిళంలో ఎప్పుడో 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అజిత్ వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను రీమేక్ చేయడమే పెద్ద సాహసం. 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కానీ దర్శకుడు మెహర్ రమేష్ ఆ ఎనిమిదేళ్ల క్రితానికి మరో పదేళ్లు వెనక్కు వెళ్లి భోళాశంకర్ సినిమా తీశాడనిపిస్తుంది. చిరు నటన మామూలుగా ఉంటుంది. అయితే దర్శకుడి టేకింగ్ లోపమో ఏమో గాని ఈ సినిమాలో చిరు నటన కూడా కాస్త అతిగా ఉందంటున్నారు. ఇక ప్రమోషన్లలో ఈ సినిమాలో చిరు కామెడీ టైమింగ్ అదిరిపోతుందని.. ఊదరగొట్టారు.
కానీ సినిమా చూస్తే మాత్రం చిరు కామెడీని తట్టుకోవడం కష్టం అంటున్నారు. ముఖ్యంగా ఖుషి సినిమాలో పవన్ – భూమిక మధ్య వచ్చే నడుము సీన్‌ను ఈ సినిమాలో చిరు – శ్రీముఖి మధ్య రీక్రియేషన్ చేశారు. ఇది చూడడానికే వెగటుగా ఉంది. ఇక చిరు సినిమాలో చాలాసార్లు పవన్‌ను ఇమిటేట్ చేయడం కూడా బాగోలేదు. ముఖ్యంగా ఖుషి సీన్ తేలిపోవడంతో పవన్ అభిమానులు మెహర్‌ను, చిరును కూడా ఏకి పడేస్తున్నారు.
పైగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే నడుము సీన్ రీక్రియేషన్ చేశారని.. అందులోనూ చిరు – శ్రీముఖి ఉన్నారనడంతో ఈ సీన్ బాగా పేలుతుందనుకున్నారు. కానీ అస్సలు చూడాలనుకోలేదు. అసలు ఈ సినిమా థియేటర్లలో చూస్తుంటే అస్సలు బాగోలేదనే అంటున్నారు.