కోలీవుడ్ సీనియర్ హీరో విశాల్, హీరోయిన్ లక్ష్మి మీనన్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ దాదాపు రెండు రోజులుగా ఒక్కటే న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై హీరో విశాల్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి ఓ హీరోయిన్‌తో జరుగుతుందంటూ వస్తోన్న వార్తలను ఖండించాడు. సాధారణంగా నాపై వచ్చే పుకార్లు, అవాస్తవ కథనాలపై తాను స్పందించను అని.. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఇప్పుడు లక్ష్మీమీనన్‌తో నా వివాహం అంటూ వస్తోన్న పుకార్లను తాను పూర్తిగా ఖండిస్తున్నా అని చెప్పాడు.
దీనిపై స్పందించడానికి ఓ కారణం ఉందని.. అయితే ఇది ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం… ఆమె నటిగా కంటే ముందు ఓ అమ్మాయి.. తనను వ్యక్తిగతంగా కించ పరిచేలా.. ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా పుకార్లు రావడంతోనే తాను స్పందిస్తున్నట్టు చెప్పాడు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. ఇక తన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎవరితో జరుగుతుందన్న దానిపై త్వరలో తానే అధికారికంగా ప్రకటన చేస్తానన్నాడు.
విశాల్ పెళ్లి వ్యవహారం చాలా రోజుల నుంచి నడుస్తోంది. గతంలో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో డేటింగ్, పెళ్లి అంటూ చాలా కథనాలు వచ్చినా.. తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డితో నిశ్చితార్థం కూడా జరిగింది.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి లక్ష్మీ మీనన్ పేరు వార్తల్లోకెక్కింది. అయితే ఇది పుకారు అని విశాల్ ఇది పుకారు అని తేల్చేశాడు.