Moviesర‌జ‌నీ ' జైల‌ర్ ' సినిమా పూరి తీసిన ఆ సినిమాకు...

ర‌జ‌నీ ‘ జైల‌ర్ ‘ సినిమా పూరి తీసిన ఆ సినిమాకు ప‌క్కా కాపీ…!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమా చూడాలి అన్న కోరిక ఈ సినిమా టీజర్, టైలర్ తో ప్రతి ఒక్కరికి కలిగింది. ట్రైలర్ చూశాక ఇందులో ఏదో విషయం ఉందన్న అభిప్రాయంతో చాలామంది తొలిరోజే సినిమా చూశారు. ఈ సినిమా కథ గతంలో పూరి జగన్నాథ్ తరకెక్కించిన ఓ సినిమాను పోలిగుందన్న అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కథ‌గా చూస్తే గుడిలో విగ్రహం చోరీతో కథ‌ మొదలవుతుంది.

రజనీకాంత్ ఒక రిటైర్డ్ జైలర్. అతడి కొడుకు డ్ర‌గ్స్ కార్యకలాపాల‌పై నిఘా పెట్టిన ఏసిపి. అతడిని ఆ క‌రైం గ్యాంగ్‌ కిడ్నాప్ చేసి చేస్తుంది. అతడు చనిపోయాడని కూడా కబురు అందుతుంది. దీంతో ముత్తు కుటుంబానికి ముత్తు ఆ గ్యాంగ్ పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రధాన స్టోరీ. కథగా చూస్తే హిందీలో అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ తీసిన బుడ్డా హోగా తేరా బాప్ లక్షణాలు కనిపిస్తాయి.

అందులో కూడా పోలీస్ ఆఫీసర్ అయిన తన కొడుక్కి ప్రమాదాలు ఎదురైతే అడ్డం పడి ఫైట్లు చేసే వృద్ధ తండ్రి పాత్రలో అమితాబచ్చన్ ని చూసాం. ఇక్కడ రజనీకాంత్ ఉంటాడు అంతే తేడా..! ఇక జైలర్ సినిమా క్లైమాక్స్ లో కమలహాసన్ భారతీయుడు చాయ‌లు కనిపిస్తాయి. ఇలా రకరకాల పాత సినిమాల ఛాయలు తగులుతున్నా కూడా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మేకింగ్ లో ఉన్న స్టైల్ వల్ల సినిమా కాస్త కొత్తగానే అనిపిస్తుంది.

సినిమా ప్రధమార్ధం చాలా ఆసక్తిగా మలిచాడు దర్శకుడు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా నిలబెట్టింది. అయితే సెకండ్ హాఫ్ కూడా ఆ స్థాయిలో ఉండి ఉంటే సినిమా ఫలితం మరింత బాగుండేది. ఏది ఏమైనా జైలర్ చాలా రోజుల తర్వాత రజిని అభిమానులకు మంచి విందు భోజనం ఇచ్చింది అని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news