Moviesర‌ష్మిక‌తో దూరం దూరం.. స‌మంత‌తో స్నేహం... మొత్తానికి విజ‌య్‌ సంథింగ్‌.. సంథింగ్‌

ర‌ష్మిక‌తో దూరం దూరం.. స‌మంత‌తో స్నేహం… మొత్తానికి విజ‌య్‌ సంథింగ్‌.. సంథింగ్‌

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది. విజయ్ నటించిన లైగ‌ర్ సినిమా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి ఖుషి వస్తుంది. ఈ క్రమంలోనే నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే కంటెంట్ పాతగానే ఉన్న ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందన్న నమ్మకాలు కలిగించేలా కాస్త ప్రామిసింగ్ గానే ఉంది.

తెలుగు ఆడియెన్స్‌కు ఎలాగోలా కనెక్ట్ అయిన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఎంతవరకు ? కనెక్ట్ అవుతుందన్న సందేహాలు అయితే ఉన్నాయి. ఇక ట్రైలర్ లాంఛ్‌ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంతను ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు. ఈ మూవీ సగం షూటింగ్ పూర్తయిన తర్వాత సమంతకు హెల్త్ ఇష్యూ వచ్చిందని.. అయితే ఆమె పూర్తిగా కోలుకున్నాకే మిగిలిన షూట్ పూర్తి చేద్దామని దర్శకుడు శివతో తాను చెప్పానని విజయ్ తెలిపాడు.

అవసరం అయితే ఆమె కోసం మరో 10 ఏళ్లపాటు అయిన ఈ సినిమాను వాయిదా వేసే వాళ్ళం.. ఈ సినిమాలో లీడ్ పెయిర్స్ ఇద్దరి పాత్రలు అంత అద్భుతంగా ఉన్నాయంటూ సమంతను మామూలుగా ప్రశంసించలేదు. ఇప్పటికే సమంత – విజ‌య్‌ స్నేహం బాగా ముదిరిపోయిందని.. వీరిద్దరూ చాలా క్లోజ్ గా అవుతున్నారన్న ప్రచారం అయితే ఉంది.

ఇలాంటి టైం లో విజయ్ సమంతను ఇంతలా ఎత్తేయడంతో మీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ మొదలైందా అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇక విజయ్‌కు… ర‌ష్మిక‌కు మధ్య ఇటీవల గ్యాప్ వచ్చిందని.. వీరిద్దరూ అంత క్లోజ్ గా ఉండటం లేదన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అదే టైంలో సమంత – విజయ్ స్నేహ‌బంధం గురించి వార్తలు వస్తుండటం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news