Moviesఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ కృష్ణ తీసిన సినిమాల లిస్ట్ ఇదే...!

ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ కృష్ణ తీసిన సినిమాల లిస్ట్ ఇదే…!

టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ కృష్ణ మధ్య సినిమాల పరంగాను.. ఇటు రాజకీయాల పరంగాను శత్రుత్వం నెలకొన్న మాట నిజం. ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య వైరం నడిచింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా అది కంటిన్యూ అయింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ ను టార్గెట్ గా చేసుకుని పలుసార్లు సినిమాలు తీయడం జరిగింది. ఇది సినిమా రంగంలో ఉన్నప్పుడు తర్వాత వీరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా జరగటం విశేషం. ఎన్టీఆర్‌కు కెరీర్ ప్రారంభం నుంచి అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలన్న కోరిక ఉండేది.

ఈ క్రమంలోనే రాజమండ్రి కి చెందిన పడాల రామారావుతో ఎన్టీఆర్ సీతారామరాజు సినిమాకు డైలాగులు రాయించారు. ఎన్టీఆర్ సీతారామరాజు సినిమా తీస్తున్నారన్న విషయం తెలుసుకున్న కృష్ణ ఆగమేఘాల మీద రామచంద్రరావు అనే డైరెక్టర్ తో సినిమా మొదలు పెట్టేసారు. అయితే ఆ సినిమా మధ్యలో ఉండగానే ఆయన చనిపోయారు.. మిగిలిన బ్యాలెన్స్‌ విజయనిర్మల పూర్తి చేశారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ మొదలుపెట్టారు. మహాభారతం ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేశారు. వెంటనే కృష్ణ ఈ సినిమాకు పోటీగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కురుక్షేత్ర సినిమా తీశారు. పైగా దానవీరశూరకర్ణ సినిమా రిలీజ్ అయిన రోజునే తన కురుక్షేత్రం కూడా రిలీజ్ చేయించారు. ఈ పొరులో కురుక్షేత్ర అట్టర్ ప్లాప్ అవ్వగా కర్ణ సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా కృష్ణ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మండల వ్యవస్థకు వ్యతిరేకంగా మండలాధీశుడు అనే సినిమా తీశారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గండిపేట కుటీరం నుంచి కార్యకర్తలు నిర్వహించేవారు. దానికి వ్యతిరేకంగా గండికోట రహస్యం అంటూ కృష్ణ మరో సినిమా తీశారు. చివరకు ఏలూరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అక్కడ టిడిపి నుంచి పోటీ చేసిన బుల్లి రామయ్య ను ఉద్దేశించి మాట్లాడుతూ బుల్లి రామయ్య నే కాదు పెద్ద రామయ్య అని కూడా ఓడిస్తానంటూ శపధం చేశారు. అలా కృష్ణ ఎందుకో గాని ఎన్టీఆర్ విషయంలో కాస్త దూకుడుగా ఉండేవాడిని అంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news