టాలీవుడ్ లో లవర్ బాయ్ గా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులర్ అయిపోయాడు దివంగత హీరో ఉదయ్ కిరణ్. రెండు సంవత్సరాల వ్యవధిలో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు ఉదయ్ కిరణ్ సొంతం అయ్యాయి. చిత్రం – నువ్వు నేను – మనసంతా నువ్వే ఇలాంటి సూపర్ డూపర్ హిట్లతో అప్పటి స్టార్ హీరోలకు సైతం దడ పుట్టించాడు. ఉదయ్ అప్పట్లో భారీ స్టార్ డం తో పాటు బలమైన సినీ బ్యాగ్రౌండ్‌తో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుకు సైతం వరుసగా మూడు హిట్లు రావడం గగనం అవుతోంది.
అలాంటిది ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా మూడు హిట్లు కొట్టడంతో ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యాడు. ఈ మూడు హిట్లర్ తర్వాత ఉదయ్ కిరణ్ కు ఏకంగా స్టార్ డైరెక్టర్లతో పాటు ఏడు ఎనిమిది పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటినుంచి ఉదయ్ కిరణ్ కెరీర్ డ్రాప్ అవుతూ వచ్చింది. ఉదయ్ కిరణ్ డేట్లు అల్లు అరవింద్ చేతుల్లోకి వెళ్లిపోయాయి అన్న గుసగుసలు అప్పట్లో బయటకు వినిపించాయి.
ఉదయ్ కిరణ్ ఏదైనా సినిమా ఒప్పుకోవాలన్న అల్లు అరవింద్ చెబితేనే ఓకే అయిన పరిస్థితి. ఈ క్రమంలోనే మురళీమోహన్ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు సినిమా వచ్చింది. మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించారు. అయితే ఈ సినిమాలో ఆఫర్ ముందుగా ఉదయ్‌కిరణ్ కి వచ్చింది అట. అప్పటికే ఉదయ్ కిరణ్ కు మురళీమోహన్‌కు మధ్య పరిచయం ఉంది. ఉదయ్ కూడా మురళీమోహన్ బ్యానర్లో అతడు సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట.
అయితే అతని డేట్స్ కోసం అల్లు అరవింద్ దగ్గరికి వెళ్ళగా.. అరవింద్ డేట్లు ఖాళీగా లేవని చెప్పాడట. దీంతో అతడు సినిమా చేయాలన్న కోరిక ఉదయ్ కిరణ్‌కు ఎంతలా ఉన్నా ఏమీ చేయలేకపోయాడట. అల్లు అరవింద్ స్వయంగా డేట్లు లేవని చెప్పడంతో చివరకు మురళీమోహన్ మహేష్ బాబుని హీరోగా పెట్టి అతడు సినిమా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అతడు సినిమా ఉదయ్ కిరణ్ చేసి ఉంటే కచ్చితంగా అతడు కెరీర్ మరోలా ఉండేదని.. దాదాపు ఆరేడేళ్ల పాటు ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండేదే కాదని అప్పటి ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కున్నారు. చివరకు వరుస ప్లాపులు పడడంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.