ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఎలా తమ పెళ్లి విషయాన్ని .. ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచేస్తున్నారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా బేబీ పుట్టిన తర్వాత బేబీ ఫొటోస్ మీడియాకు లీక్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఆల్మోస్ట్ అందరూ సెలబ్రిటీస్ ఇలాగే చేస్తూ వస్తున్నారు . అయితే వీళ్ళందరికీ భిన్నంగా ప్రవర్తించింది హీరోయిన్ పూర్ణ . తన కొడుకుని అందరికీ పరిచయం చేస్తూ ఫొటోస్ ని మీడియాకు రివీల్ చేసింది .
చాలా బొద్దుగా క్యూట్‌గా పూర్ణ కొడుకు ఉండడంతో ఈ ఫొటోస్ సెకండ్స్ లోనే వైరల్‌గా మారిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ రీసెంట్ గానే షానిద్ అసిఫ్ అలీ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది .వీళ్ళ నిశ్చితార్ధం..పెళ్లి జరిగిన విషయాన్ని సీక్రెట్ గా దాచిన పూర్ణ ప్రెగ్నెన్సీ విషయం మాత్రం సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
తన బేబీ పంప్ కి సంబంధించిన పిక్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే వచ్చింది . ఈ క్రమంలోనే పూర్ణ రీసెంట్గా ఓ మ్యారేజ్ లో మెరిసింది . చందమామల అందంగా తయారైన పూర్ణ తన కొడుకు ఫొటోస్ ని మీడియాకు షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో ఆమె..ఆమె భర్త .. ఆమె బేబీ చాలా క్యూట్ గా అందంగా కనిపించారు . ఈ క్రమంలోనే పూర్ణ కొడుకు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ బాబు పూర్ణా లా లేడు.. తన తండ్రి పోలికలతో లేడు.. అచ్చం వాళ్ల నాన్నమ్మ పోలికలతో ఉన్నాడు అంటూ సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారు..!!