టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార కు ప్రజెంట్ ఎలాంటి స్థానం ఉందో ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన కంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ తమిళ్ బ్యూటీ ..ప్రెసెంట్ అట్లీ దర్శకత్వం “జవాన్” సినిమాలో నటిస్తుంది . కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంత అనుకుంటున్నారు.
ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ లోనూ కోలీవుడ్ లోనూ సినిమాలకు సైన్ చేస్తున్న నయనతార టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు వస్తున్న సినిమాలకు సైన్ చేయడం లేదు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే నయనతార ఫ్యాన్స్ ఎందుకా..? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే నయనతార తెలుగులో సినిమా చేయాలి అంటే డైరెక్టర్స్ కి కొన్ని కండిషన్స్ పెడుతుందని ..ఆ కండిషన్స్ భరించలేక తెలుగు డైరెక్టర్లు నిర్మాతలు ఆమె కు ఒక అవకాశం ఇవ్వకుండా తప్పుకుంటున్నారని తెలుస్తుంది.
తమిళంలో బిజీబిజీగా ఉండే నయనతార తెలుగులో ఆఫర్లువస్తున్న సరే సైన్ చేయడం లేదు. దానికి కారణం ఆమె ఏకంగా ట్రిపుల్ స్థాయిలో రెమ్యూనరేషన్ కావాలి అంటూ డిమాండ్ చేస్తుందట . అంతేకాదు కాల్ షీట్ విషయంలో కూడా కొత్త కండిషన్స్ పెడుతుందట .మరి ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ చేయను.. సినిమా ప్రమోషన్స్ కి రాను అని ఫస్ట్ నుంచి చెప్పే నయనతార ఇలా సడెన్ గా పారితోషకం పెంచేస్తే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు మేకర్స్ . అంతేకాదు నయనతార కన్నా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకొని నటిస్తున్నారు..మరి నీకెందుకు అంత పారితోషకం ఇచ్చి సినిమాలో పెట్టుకోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకే నయనతార ను సినిమాలో హీరోయిన్గా తీసుకోకుండా వేరే బ్యూటీస్ ని తీసుకుంటున్నారు. ఇదే కొనసాగితే నయనతార కెరియర్ ఖతమయిపోయినట్లే అంటున్నారు సినీ ప్రముఖులు. అయితే నయన్ ఫ్యాన్స్ మాత్రం మా హీరోల పై నమ్మకం లేదా మేడమ్.. సినిమా హిట్ అవ్వదు అన్న భయంతోనే ఇలా ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారా..? అని అడిగేస్తున్నారు..!!