టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శర్వానంద్ కి ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ పాన్ ఇండియా హీరో కి ఉన్న క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ ..అభిమానం దక్కుతూ ఉంటుంది శర్వానంద్ కి అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. ప్రతి సినిమాలో సరికొత్త కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తూ తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ రీసెంట్ గానే రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు .
ఈ ఏడాది మొదట్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా రక్షిత రెడ్డితో ఆయన పెళ్లి చాలా చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా జరిగింది . ఆ తర్వాత హైదరాబాద్ లో ఇచ్చిన రిసెప్షన్ కి టాలీవుడ్ సినీ ప్రముఖులు కదిలి వచ్చి జంటను ఆశీర్వదించారు. మరి ముఖ్యంగా ఈ రిసెప్షన్లో రామ్ చరణ్ జంట హైలెట్గా నిలిచింది . కాగ ఇప్పుడు సోషల్ మీడియాలో శర్వానంద్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.
ఈ యంగ్ హీరో శర్వానంద్ నాన్న అని పిలిపించుకోబోతున్నాడు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. యంగ్ హీరోలు అందరూ కంటెంట్ ఉన్న సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా నాని ఆయన 30వ సినిమాలో నాన్న పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా శర్వానంద్ సైతం అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు . శర్వానంద్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఈ మూవీలో ఆయన తండ్రి పాత్రలో కనిపించబోతున్నడట . ఈ సినిమాకి “బేబీ ఆన్ బోర్డ్” అనే టైటిల్ కూడా పెట్టాలి అనుకుంటున్నారట మేకర్స్. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం . శ్రీరామ ఆదిత్య ఇప్పటివరకు చాలా డిఫరెంట్ సినిమాలు తీశారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు కమర్షియల్ గా హిట్టు కాకపోయినా జనాలను మాత్రం బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎంగేజ్ లోనే ఇలా హీరో శర్వానంద్ తండ్రి పాత్రలు చేయడానికి ఒప్పుకొని పెద్ద రిస్కే చేస్తున్నాడు అంటున్నారు అభిమానులు.