టాలీవుడ్లో లేటెస్ట్గా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా బేబీ. యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్లో అల్లు అరవింద్‌తో పాటు అల్లు అర్జున్ లాంటి పెద్దల సపోర్ట్‌గా ఫుల్‌గా ఉంది. చివరకు మెగాస్టార్ చిరంజీవి కూడా సక్సెస్ మీట్‌కు అటెండ్ అయ్యారు.
ఈ సినిమాతోనే మెగా ఫ్యామిలీ భక్తుడు, ఆ ఫ్యామిలీ సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన ఎస్కేఎన్ నిర్మాతగా మారారు. ఈ క్రమంలోనే విజయయాత్ర జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతోన్న యాత్రలో మీడియా మిత్రులకు ఈ చిత్ర యూనిట్‌కు ఏదో వాగ్వివాదం జరగడంతో ఎస్కేఎన్ కూడా మీడియా వాళ్లపై రెచ్చిపోయారు. నేను జర్నలిస్టునే అంటూ ఆయన కాస్త దూకుడుగా ముందుకెళ్లిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
ఓ జర్నలిస్టుగా.. ఈ విజయవంతమైన సినిమాకు నిర్మాతగా ఉన్న ఎస్కేఎన్ కాస్త సంయమనంతో వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ జర్నలిస్టులు అయితే మమ్మలను కొట్టేస్తారా.. సేవ్ సారీ.. భీమవరం మీడియా అంతా ఇక్కడే ఉందంటూ అక్కడ మీడియా వాళ్లు రెచ్చిపోయి నిర్మాత ఎస్కేఎన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో జర్నలిస్టులపై బౌన్సర్లతో దాడి చేయించిన బేబీ నిర్మాత అని వైరల్ అవుతున్నాయి.